Taj Mahal : ప్రేమకు ప్రతిరూపంగా తాజ్‌మహల్‌ను (Taj Mahal) షాజహాన్ తన ముంతాజ్ (Muntjac) కోసం కట్టించాడని అందరూ చెప్పుకుంటారు. పాలరాతితో ఎంతో అందంగా, అద్భుతమైన శిల్పాలతో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో కట్టించాడు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఈ తాజ్ మహల్ కూడా ఒకటి. తాజ్ మహల్ (Taj Mahal) తెల్లగా చూడటానికి చాలా సుందరంగా ఉంటుంది. దీన్ని చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో వెళ్తుంటారు. తాజ్‌మహల్‌ను (Taj Mahal) చూడటానికి అసలు రెండు కళ్లు కూడా చాలవు. షాజహాన్ ప్రేమకు గుర్తుగా ఈ తాజ్‌మహల్ చిరస్థాయిగా నిలిచిపోయింది. భార్య ముంతాజ్‌ను విపరీతంగా ప్రేమించాడు. ఆమె మరణించిన తర్వాత కూడా తనతోనే ఉండాలనే కోరికతో షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించాడు. నిజానికి ఇంతటి అద్భుతమైన తాజ్‌మహల్‌ను కట్టంచింది షాజ్‌హాన్ (Shajahan) అయినప్పటికీ.. దానిని నిర్మించిన వాస్తుశిల్పులకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలో కూడా ఎంతో సుందరంగా తాజ్‌మహల్‌ను (Taj Mahal) నిర్మించారంటే ఎంత గొప్పో అర్థం చేసుకోవాల్సిందే. పర్షియన్, ఒట్టోమన్, భారతీయ, ఇస్లామిక్ అన్ని కలిసేలా దీన్ని నిర్మించారు. ఇందుకేనేమో తాజ్‌మహల్ ఏడు వింతల్లో ఒక వింతగా నిలిచింది. అయితే ఇంతటి అద్భుతమైన కట్టడాన్ని నిర్మాణం వెనుక ఎందరో డిజైనర్లు, వాస్తుశిల్పులు, కార్మికుల కష్టం ఉంది. మరి ఈ తాజ్‌మహల్‌ను నిర్మించిన వాస్తుశిల్పి ఎవరు? అతను ఎంత డబ్బు తీసుకున్నాడో? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తాజ్‌మహల్ వాస్తుశిల్పి ఉస్తాద్-అహ్మద్ లాహోరీ. ఇతను అత్యుత్తమమైన వాస్తుశిల్పుల్లో ఒకరు. పాకిస్థాన్‌కి చెందిన ఇతను తాజ్ నిర్మాణానికి రూ.10,000 తీసుకున్నాడట. ఈ రోజుల్లో పది వేలు అంటే చాలా తక్కువ. అప్పటిలో వాస్తుశిల్పి వేతనం పది వేలు ఇప్పటిలో సీఈఓలు తీసుకునే జీతం కంటే ఎక్కువట. తాజ్‌మహల్ చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. దాదాపుగా 17 హెక్టార్ల విస్తీర్ణంలో విశాలమైన మొఘల్ తోటలో యమునా నదికి కుడి వైపున నిర్మించారు. దీని నిర్మాణం కోసం రాతి కట్టేవారు, రాతి కట్టర్లు, చెక్కేవారు, చిత్రకారులు, కాలిగ్రాఫర్లు, గోపురం బిల్డర్లు, కళాకారులను ప్రపంచ నలుమూలల నుంచి తీసుకొచ్చి నిర్మించారట. అయితే తాజ్ మహల్ 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పర్యాటకులను అద్భుతమైన తాజ్‌మహల్‌ను సందర్శిస్తుంటారు.