Miroki Robot: అదంటే సినిమా కాబట్టి.. సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది కాబట్టి.. అద్భుతం లాగా మనకు కనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో అలా జరుగుతుందా.. ఇప్పటికైతే రక్షణ రంగంలో.. వైద్య రంగంలో.. పరిశోధన రంగంలో రోబోల వినియోగం తప్పనిసరి అయింది. అయితే రోబోలను ఇప్పుడు ఇంటి పనులకు కూడా వాడటం మొదలైంది. అట్లు తోముడం నుంచి మొదలుపెడితే దుస్తులు ఉతికేంతవరకు.. ఇల్లాలి కి శ్రమ లేకుండా రోబోలు చేస్తున్నాయి. అలవోకగా పనులు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. పని వాళ్ళ కొరత తీరుస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి.. అంతేకాదు అధునాతనమైన పనులు కూడా చేస్తూ ఆకట్టుకుంటున్నాయి.. ఇక ఇటీవల రోబోలా పనితీరుకు సంబంధించి అమెరికాలోని లాస్ వేగాస్ లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జరిగింది. ఈ షోలో వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా రోబోల పనితీరు.. చోటుచేసుకునే మార్పులు కళ్ళకు కట్టాయి. అయితే ఇప్పటివరకు హోటళ్లు, షాపింగ్ మాల్స్.. ఆతిధ్య సేవల్లో మాత్రమే నిమగ్నమైన రోబోలను మనం చూసాం. అయితే ఇవన్నీ ముందే సిద్ధం చేసిన ప్రోగ్రాం కు అనుగుణంగా పనిచేస్తాయి. అంటే కేవలం ఒకే పనిని మాత్రమే అవి చేయగలుగుతాయి. అయితే భవిష్యత్తు కాలంలో మనతో మాటలు కలిపి.. మన ఆదేశాలకు అనుగుణంగా కృత్రిమ మేలుతో పనిచేసే రోబోలు అందుబాటులోకి రాబోతున్నాయి. మరమనిషి అనే పదాన్ని తుడిచేసి.. విభిన్నమైన ఆకారాలు.. విభిన్నమైన పరిమాణాలలో రోబోలు కనువిందు చేయనున్నాయి. ప్రఖ్యాత సాంకేతిక కంపెనీలు ఈ రోబోలను తీర్చి దిద్దుతున్నాయి.
ఇంటి పని నుంచి..
లాస్ వేగాస్ లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఇంటి పనుల్లో సహకరించే హైటెక్ రోబోలు ప్రత్యేకంగా కనిపించాయి. ఇంటిని శుభ్రం చేయడం.. మొక్కలకు నీళ్లు పెట్టడం.. స్విమ్మింగ్ పూల్స్ లో నేటిని పట్టడం.. హాల్లో కర్టెన్ లను శుభ్రం చేయడం వంటి పనులను చేశాయి.. ముఖ్యంగా రిచ్ టెక్ రోబోటెక్ అనే సంస్థ ఆడమ్ అనే బార్ టెండర్ రోబోను తయారు చేసింది. అలాగే మిరుమి అనే చిన్న రోబో వీక్షకుల మాటలకు అనుగుణంగా స్పందిస్తూ ఆకట్టుకున్నది. టాంజిబుల్ ఫ్యూచర్ అనే సంస్థ రూపొందించిన చాట్ జిపిటి ఆధారిత “లూయీ”, ఎన్ చాంటెడ్ టూల్స్ సంస్థ రూపొందించిన “మిరోకై” అనే రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవే కాక, ఇతర పనులు చేయడానికి కూడా రోబోలను రూపొందించారు. స్థూలంగా చూస్తే భవిష్యత్తు కాలం రోబోలదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని కంపెనీలు అయితే వంటలు కూడా తయారు చేసే రోబోలను రూపొందించాయి. అయితే ఇవన్నీ కూడా ప్రయోగ దశలో ఉన్నాయి. ప్రయోగ దశ దాటి గనుక ఇవి ముందుకు వస్తే.. వంటింట్లో ఆడవాళ్లకు శ్రమ తప్పుతుంది. అంతేకాదు పని మనుషుల కొరత కూడా తీరుతుంది. అయితే ఇదే సమయంలో ఉపాధి లభించక చాలామంది రోడ్డున పడే పరిస్థితి కూడా నెలకొంటుంది.