
Allu Arjun Dowry: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నారో ఆయన మామగారు చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. యాంకర్ అల్లు అర్జున్ కి మీరు ఎంత కట్నం ఇచ్చారని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా.. అల్లు అర్జున్ ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. వారి కుటుంబం చాలా మంచిది. వరకట్నానికి వారు వ్యతిరేకం. పైపెచ్చు అల్లు అర్జున్ తన ఫ్యామిలీ మెంబర్స్ కి తన వంతు బాధ్యతగా ఏదైనా చేయాలనుకుంటారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు సప్పోర్ట్ ఇస్తారు. ఆయనకే చాలా ఉంది. ఇక మనం ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రశేఖర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ క్రేజ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. తరచుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే నా ఫ్రెండ్స్ ఉన్నారు. నార్త్ ఇండియా హోటల్స్ ఇతర ప్రదేశాల్లో అల్లు అర్జున్ సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయని వారు చెప్పారని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఒకసారి నా వైఫ్ జమ్మూ కాశ్మీర్ వెళ్ళింది. అల్లు అర్జున్ అత్తగారని తెలిసిన నార్త్ ఆడియన్స్ ఆమెతో సెల్ఫీలు దిగారట, ఆయన క్రేజ్ అలా ఉందంటూ… చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
చిరంజీవితో కూడా నాకు మంచి అనుబంధం ఉందని. ఆయన బాగా పలకరిస్తారని, నేను ఆయన అభిమానినని చంద్రశేఖర్ రెడ్డి తన ఆనందం పంచుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డికి హైదరాబాద్ లో విద్యా సం సంస్థలు ఉన్నాయి. వీరి అమ్మాయి స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2011లో అల్లు అర్జున్-స్నేహారెడ్డిల వివాహం ఘనంగా జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి అయాన్, అమ్మాయి అర్హ. శాకుంతలం మూవీలో అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేస్తున్నారు.

కాగా చంద్రశేకర్ రెడ్డి మొదట్లో అల్లు అర్జున్ ని అల్లుడు చేసుకునేందుకు ఒప్పుకోలేదనే ప్రచారం ఉంది. సినిమా వాళ్ళ పట్ల మంచి అభిప్రాయం లేని చంద్రశేఖర్ రెడ్డి అల్లు అరవింద్ స్వయంగా వెళ్లి పిల్లను అడిగినా ఇవ్వను అన్నాడట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రచారం అయితే ఉంది. ఇక అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. గత మూడేళ్ళలో ఆయన ఇమేజ్ డబుల్ అయ్యింది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూట్లో పాల్గొంటున్నారు.