
Shahrukh Khan: స్టార్ గా ఎదగడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా సినిమా నేపథ్యం లేని నటులకు కత్తిమీద సామే. అవమానాలు, అనుభవాలు, గుణపాఠాలు, మంచి, చెడు అన్ని చూడాల్సి ఉంటుంది. ఢిల్లీకి చెందిన ఒక సాధారణ కుర్రాడు బాలీవుడ్ బాద్షాగా ఎదిగాడు. బాలీవుడ్ మీద షారుక్ ఖాన్ ది ఎన్నటికీ చెరగని సంతకం. ఎవ్వరూ చేరుకోలేని కొన్ని రికార్డ్స్ ఆయన సొంతం. దాదాపు మూడు దశాబ్దాల సినీ ప్రస్థానం ఆయన అనేక మైలురాళ్లు దాటారు. ఉన్నతమైన లక్ష్యాలను చేరుకున్నారు. అరుదైన గౌరవాలు పొందారు. కాగా తనకు ఎదురైన ఒక అనుభవాన్ని షారుక్ ఓ సందర్భంలో బయటపెట్టారు.
సరోజ్ ఖాన్ ఒక గొప్ప జీవిత సత్యం చెప్పారు. ఓ సినిమా కోసం నాతో ఆమె రోజుకు మూడు షిఫ్ట్స్ పనిచేయించారు. దాంతో నేను సెట్స్ లో పని బాగా ఎక్కువైపోతోంది. కష్టపెడుతున్నారని కంప్లైంట్ చేశారు. అప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి, తల వెనుక భాగాన తట్టారు. బాబు ఒక ఆర్టిస్ట్ గా పని ఎక్కువైందని ఎప్పుడూ బాధపడకు, ఆరోపణలు చేయకు. ఎందుకంటే పనిలేకుండా ఉన్నరోజు అత్యంత దుర్భరం. అసలు సమస్య వర్క్ లేకపోవడమే, అని చెప్పారు. అది ఎంత గొప్ప మాటో నాకు అర్థమైంది. ఆమె గొప్ప టీచర్ గా నాకు ఒక పాఠం చెప్పారు. అది నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. స్ఫూర్తిగా తీసుకుని మరింత హార్ట్ వర్క్ చేశాను అని షారుక్ సరోజ్ ఖాన్ తో తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

1958 నుండి బాలీవుడ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్ గా సరోజ్ ఖాన్ ఉన్నారు. ‘చోళీ కే పీచే క్యాహే’ ఇండియాను ఊపేసిన సాంగ్. ఆమె కంపోజ్ చేసిన సాంగ్స్ లో ఇది కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే. లెజెండరీ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న సరోజ్ ఖాన్ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. తన సినిమా ప్రస్థానంలో 3000 పాటలకు పైగా పనిచేశారు. 71 ఏళ్ల వయసులో 2020లో ఆమె కన్నుమూశారు. మరణించేవరకు పనిచేస్తూనే ఉన్నారు.
చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కి డాన్స్ విషయంలో ఆమె గురువుగా ఉన్నారు. అందుకే షారుక్ వంటి హీరో ఆమె ఔన్నత్యాన్ని అంతగా పొగిడారు. మరోవైపు షారుక్ పఠాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వెయ్యికోట్ల క్లబ్ లో చేరింది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించారు. సల్మాన్ ఖాన్ చిన్న క్యామియో రోల్ లో మెరిశారు. తెలుగులో సైతం పఠాన్ విశేష ఆదరణ దక్కించుకుంది.