Anand Mahindra: ఆదివారం.. మిగతా ఆరు రోజులు కష్టపడి పనిచేసి.. ఆరోజు మాత్రం సెలవు తీసుకునే దినం. ఐటీ పరిశ్రమలో పనిచేసే వారికి మాత్రం రెండు రోజులు వెసలుబాటు ఉంటుంది. మిగతా వారికి ఆ అవకాశం ఉండదు. ఆరు రోజులు పని చేసి కేవలం ఆదివారం మాత్రమే విశ్రాంతి తీసుకోవాలి. ప్రపంచంలో దాదాపు అందరూ ఉద్యోగులు ఆదివారం అంటే విపరీతమైన ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు సెలవు దినం కాబట్టి.. సరదాగా కుటుంబంతో గడపొచ్చు. స్నేహితులతో బయటికి వెళ్ళొచ్చు. ఇంట్లో ఉండి సరదాగా ఏదైనా నచ్చిన సినిమా చూడొచ్చు. ఆదివారం అంటే మనకున్న ఒత్తిడిని తొలగించుకునే రోజు అని వెనుకటికి ఒక తత్వవేత్త చెప్పాడు. ప్రస్తుతమున్న బిజీ లైఫ్ లో.. కెరియర్, డబ్బు వెంటపడుతున్న రోజుల్లో ఆదివారం అంటే ఒక పండుగ. హైదరాబాదు లాంటి మెట్రోపాలిటన్ సిటీలో అయితే ఆదివారం వస్తే చాలు రెస్టారెంట్లు, శివారు ప్రాంతాల్లో ఉన్న రిసార్టులు కిటకిటలాడుతుంటాయి. అయితే ఆదివారం ఒక్కొక్కరు ఒక విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రముఖ మహీంద్రా కంపెనీ అధిపతి ఆనంద్ మహీంద్రా ఆదివారం గురించి సరికొత్తగా సూత్రికరించారు.
ఆనంద్ మహీంద్రా కార్పొరేట్ కంపెనీలకు అధిపతి అయినప్పటికీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయనను ట్విట్టర్లో మిలియన్ల కొద్ది యూజర్లు ఫాలో అవుతున్నారు. సామాజిక స్పృహ ఎక్కువగా ఉండే ఆనంద్ మహీంద్రాలో హాస్య చతురత కూడా ఎక్కువే. వ్యంగ్యంగా పోస్టులు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను ప్రదర్శించడంలో ఆయనకు ఆయనే సాటి. పైగా దానికి తగ్గట్టు అందమైన భాషను వాడుతుంటారు. ఫలితంగా ఆయన పెట్టిన ఏ పోస్ట్ అయినా సరే వెంటనే వైరల్ అయిపోతుంది.
తాజాగా సండే గురించి కూడా ఆయన చాలా వినూత్నమైన పోస్ట్ పెట్టారు.. సాధారణంగా ఆదివారం అంటే అందరూ విశ్రాంతిని కోరుకుంటారు. ఏదైనా పని చేసేందుకు పెద్దగా ఇష్టపడరు.. కొంతమంది పడుకుంటారు. ఇంకొంతమంది ఏదైనా ప్రాంతానికి వెళ్తుంటారు. ఒక్కొక్కరు ఒక్క విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఆనంద్ మహీంద్రా మాత్రం అడవిలో ఒక సింహం చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటున్న ఒక ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈరోజు ఆదివారం. కాబట్టి రేపు కలుస్తాను. సండే అనే హష్ టాగ్ ను జోడించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. విషయ చతురతలో మీకు మీరే సాటి అని ఆనంద్ మహీంద్రా ను కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Come back later. I’m busy. #Sunday pic.twitter.com/JSD0W9bbBo
— anand mahindra (@anandmahindra) August 6, 2023