https://oktelugu.com/

Gajala : హీరోయిన్ ‘గజాల’ ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో చూసారా..? ఆమె లేటెస్ట్ లుక్స్ చూస్తే కుర్రాళ్ళు ఏమైపోతారో!

Gajala : కొంతమంది హీరోయిన్లకు అందం,అభినయం అన్నీ కలిసొచ్చినా కూడా ఎందుకో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంటారు.దర్శకులు కోరుకునే విధంగా వాళ్ళు మారినప్పటికీ కూడా అదృష్టం కలిసిరాక ఇండస్ట్రీ నుండి మాయమైపోతుంటారు.అలాంటి హీరోయిన్స్ లో ఒకరు గజాల.ఈమె 2001 వ సంవత్సరం లో జగపతిబాబు హీరో గా నటించిన ‘నాలో ఉన్న ప్రేమ’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది.కమర్షియల్ గా ఆ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు.ఆ తర్వాత ఈమె దర్శక ధీరుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2023 / 09:59 PM IST
    Follow us on

    Gajala : కొంతమంది హీరోయిన్లకు అందం,అభినయం అన్నీ కలిసొచ్చినా కూడా ఎందుకో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంటారు.దర్శకులు కోరుకునే విధంగా వాళ్ళు మారినప్పటికీ కూడా అదృష్టం కలిసిరాక ఇండస్ట్రీ నుండి మాయమైపోతుంటారు.అలాంటి హీరోయిన్స్ లో ఒకరు గజాల.ఈమె 2001 వ సంవత్సరం లో జగపతిబాబు హీరో గా నటించిన ‘నాలో ఉన్న ప్రేమ’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది.కమర్షియల్ గా ఆ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు.ఆ తర్వాత ఈమె దర్శక ధీరుడు రాజమౌళి – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘స్టూడెంట్ నెంబర్ 1 ‘ సినిమా ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.

    ఆ సినిమా హిట్ అవ్వడంతో ఈమెకి వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి.మూడవ సినిమా ‘ఓ చిన్నదాన’ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది..ఇలా వరుసగా రెండు హిట్స్ రావడం తో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

    ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తో ‘కలుసుకోవాలని’, తరుణ్ తో ‘అదృష్టం’ మరియు జూనియర్ ఎన్టీఆర్ తో ‘అల్లరి రాముడు’ వంటి సినిమాలలో నటించింది.ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు, అయ్యినప్పటికీ కూడా ఈమెకి మంచి అవకాశాలే వచ్చాయి.కానీ రాజశేఖర్ హీరో గా నటించిన ‘భరత సింహా రెడ్డి’ సినిమా షూటింగ్ సమయం లో ఆత్మహత్యాయత్నం చేసింది.అక్కడి నుండి ఈమె కెరీర్ డౌన్ అవ్వడం ప్రారంభించింది.స్టార్ హీరోలు మరియు దర్శకులు ఆమెతో సినిమాలు చెయ్యడానికి భయపడేవారు.అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం తో చిన్న సినిమాల్లోనూ నటించడానికి ఒప్పుకుంది.అలా కెరీర్ చిన్న సినిమాలతోనే తన కెరీర్ ని ముగించేసింది.

    కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు ఆమె చేసిన చిన్న పొరపాటు ఆమె సినీ జీవితాన్ని తలక్రిందులు చేసిందని విశ్లేషకులు చెప్తున్నారు.2011 వ సంవత్సరం తర్వాత సినిమాలకు ‘గుడ్ బై’ చెప్పేసిన గజాల ఫైజల్ రజా ఖాన్ అనే అతనిని పెళ్లాడింది.అయితే ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో లీక్ అయ్యి వైరల్ గా మారాయి.అప్పట్లో ఈమె ఎంత అందంగా ఉండేదో, ఇప్పటికీ అంత అందం తో ఉండడం అందరినీ షాక్ కి గురి చేసింది.ఆ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

    Tags