Roshan Kanakala shed tears: యాంకర్ సుమ(Anchor Suma) కొడుకు రోషన్(Roshan Kanakala) హీరో గా నటించిన లేటెస్ట్ గా చిత్రం ‘మోగ్లీ'(Mowgli Movie) రీసెంట్ గానే విడుదలై ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం నిల్. ఎందుకంటే ఆడియన్స్ ఈ సినిమా ఒకటి విడుదల అయ్యింది అనే విషయాన్నీ కూడా గుర్తించలేదు. పైగా బాలయ్య ‘అఖండ 2’ పోటీకి దించడం కూడా ఈ సినిమాకు మైనస్ అయ్యింది. ‘కలర్ ఫోటో’ లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాని తెరకెక్కించిన సందీప్ రాజ్ నుండి వచ్చిన రెండవ చిత్రమిది. అక్కడక్కడా కాస్త నెగిటివ్ కామెంట్స్ ఈ సినిమాపై వినిపించాయి కానీ, ఓవరాల్ గా మొదటి సినిమాతో పోలిస్తే కాస్త డీసెంట్ సినిమా అనే టాక్ ప్రతీ ఒక్కరి నుండి వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని రీసెంట్ గానే ఏర్పాటు చేశారు.
ఈ సక్సెస్ మీట్ లో రోషన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మా అమ్మ ని రమ్మని పిలిచాను. కానీ ఆమె జీవితాంతం నేను నీ తోడు ఉండలేను, నీ కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగు, మా అవసరం నీకు ఇక ఉండకూడదు అని చెప్పింది. మా నాన్న సిద్ధాంతం కూడా అదే. మా అమ్మానాన్నలు ఇద్దరు కూడా నా ఈవెంట్స్ కి రాలేరు. అది నేను చేసుకున్న దురదృష్టం. ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉండుంటే, అందరి ముందు వాళ్ళిద్దరి కాళ్లకు నమస్కరించేవాడిని . ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను కదా’ అంటూ రోషన్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే మొదటి సినిమాకు అటు సుమ, ఇటు రాజీవ్ కనకాల రోషన్ ని ప్రమోట్ చేయడం కోసం చాలానే కష్టపడ్డారు.
ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే, మొదటి రోజు కోటి 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకు, రెండవ రోజున కోటి 20 లక్షలు, మూడవ రోజున కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. టికెట్ రేట్లు కేవలం 99 రూపాయిలు పెట్టడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. అలా మొదటి మూడు రోజులు 4 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఫలితంగా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. కానీ రోషన్ నటనకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కాకపోతే, భవిష్యత్తులో మంచి సినిమా చేస్తే, కచ్చితంగా ఈ కుర్రాడు పెద్ద రేంజ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.