spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: జ‌గ‌న్ జైలుకు పోతార‌ని బీఆర్ఎస్ నేత‌లు అంత క‌చ్చితంగా ఎలా చెబుతున్నారు !

YS Jagan: జ‌గ‌న్ జైలుకు పోతార‌ని బీఆర్ఎస్ నేత‌లు అంత క‌చ్చితంగా ఎలా చెబుతున్నారు !

YS Jagan: అన్న జైల్లో ఉన్న‌ప్పుడు ఆమె అన్నీ తానై వ్య‌వ‌హ‌రించింది. కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగింది. అన్న వ‌దిలిన బాణం అంటూ ఊరూరా డ‌ప్పు వేసింది. అన్న అధికారంలోకి రాగానే ప‌క్కకు నెట్టివేయ‌బ‌డింది. కూర‌లో క‌రివేపాకులా మారిపోయింది. పోయిన చోట వెతికితే దొరుకుతుంద‌నేది పెద్ద‌లు సామెత‌. ఇప్పుడు ప్ర‌త్య‌ర్థులు కూడా అదే చెబుతున్నారు. పోగొట్టుకున్న చోట కాకుండా ఇంకో చోట వెతికితే దొర‌క‌ద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. ఇంత‌కీ ఆమె ఎవ‌రు ? ఆమె పోగొట్టుకున్న‌దేంటో చ‌దివేయండి.

YS Jagan
YS Jagan

వైఎస్ ష‌ర్మిల ఒక‌ప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో క్రియాశీల‌క నాయ‌కురాలు. జ‌గ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు వేలాది కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేశారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. సీన్ క‌ట్ చేస్తే. ష‌ర్మిళ తెలంగాణలో పాద‌యాత్ర చేస్తున్నారు. అధికారం రాగానే అన్న ఆమెను ప‌క్క‌నబెట్టారు. దీంతో చేసేదేంలేక‌.. తెలంగాణ‌లో పార్టీ పెట్టి పాద‌యాత్ర చేసుకుంటున్నారు. అన్యాయం చేసిన అన్న‌ను వ‌దిలి కేసీఆర్ ప్ర‌భుత్వం పై ష‌ర్మిల విరుచుకుపడుతోంది. దీంతో బీఆర్ఎస్ నేత‌లు ష‌ర్మిల‌కు కౌంట‌ర్లు ఇస్తున్నారు.

వైఎస్ ష‌ర్మిల కుటుంబం మొద‌టి నుంచి తెలంగాణ‌కు వ్య‌తిరేక‌మ‌ని బీఆర్ఎస్ నేత క‌డియం శ్రీహ‌రి చెప్పారు. ఆమె వ‌ల్ల తెలంగాణ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని, ఆమె అవ‌స‌రం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు లేద‌ని అన్నారు. ష‌ర్మిళ‌కు ఏపీలో అన్యాయం జ‌రిగిందని, అక్క‌డ‌కెళ్లి త‌న గోడు వెళ్ల‌బోసుకుంటే ఉప‌యోగం ఉంటుంద‌ని సూచించారు. తెలంగాణ‌లో గోడు వెళ్ల‌బోసుకుంటే ఉప‌యోగం ఉండ‌ద‌ని అన్నారు. గ‌తంలో కూడా ష‌ర్మిళ ఏపీలో పాద‌యాత్ర చేసిన‌ట్టు గుర్తు చేశారు. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ష‌ర్మిళ‌ను ప‌క్క‌నబెట్టార‌ని, ఆ కోపంతో తెలంగాణ‌లో పార్టీ పెట్టింద‌ని చెప్పారు. దీని వ‌ల్ల ఆమెకు ఉప‌యోగం లేద‌ని అన్నారు.

YS Jagan
YS Jagan

వైఎస్ జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులోనో, వైఎస్ వివేకా హ‌త్య కేసులోనే జైలుకు వెళ్తార‌ని, అప్పుడు ష‌ర్మిళ ఏపీ సీఎం అవుతుంద‌ని జోస్యం చెప్పారు. ఏపీకి వెళ్లి పోరాటం చేయాల‌ని క‌డియం శ్రీహ‌రి సూచించారు. ఇప్పుడు క‌డియం శ్రీహ‌రి చేసిన వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జ‌గ‌న్ త‌ర్వాత ష‌ర్మిళే సీఎం అవుతుంద‌నడం వైసీపీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. క‌డియం శ్రీహ‌రి వ్యాఖ్య‌ల వెనుక అంత‌రార్థం ఉంద‌ని తెలుస్తోంది. ఏపీ సీఎం ష‌ర్మిళ అనే పాయింట్ ఫోక‌స్ చేయ‌డం ద్వార తెలంగాణ‌లో ష‌ర్మిళ వెంట ఉన్న‌వారిని మాన‌సికంగా దెబ్బ‌తీయొచ్చు. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేయ‌వ‌చ్చ‌నేది బీఆర్ఎస్ వ్యూహంగా క‌నిపిస్తోంది.

ఒక‌వేళ జ‌గ‌న్ జైలుకు వెళితే… వైసీపీకి ష‌ర్మిళ‌నే దిక్కువుతుంద‌నేది క‌డియం శ్రీహ‌రి వ్యాఖ్య‌ల వెనుక ఉన్న అర్థంగా తెలుస్తోంది. అప్పుడు తెలంగాణ‌లో వైస్ఆర్టీపీ మూత‌ప‌డుతుంది. తెలంగాణ‌లో జెండా పీకేస్తుంది. దీంతో ఆమె వెంట ఉన్న‌వారు ఒంట‌రిగా మిగిలిపోతార‌నేది క‌డియం వ్యాఖ్య‌ల అంత‌రార్థం. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ త‌ర్వాత వైసీపీ పై ష‌ర్మిళ‌కు మంచి ప‌ట్టు ఉంది. గ‌తంలో పాద‌యాత్ర చేసింది. వైసీపీ నేత‌ల‌తో సంబంధాలు ఉన్నాయి. జ‌గ‌న్ త‌ర్వాతి స్థానం ష‌ర్మిళ‌కే ఉంటుంది. పార్టీని న‌డ‌ప‌గ‌లిగే శ‌క్తి కూడా ష‌ర్మిళ‌కు ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. వైఎస్ భార‌తితో పోల్చితే వైఎస్ ష‌ర్మిళ‌నే అన్ని విధాలుగా రాజకీయాల‌కు అర్హురాలు అనే వాద‌న వైసీపీలో కూడా ఉంది. ఇదంతా జ‌గ‌న్ జైలుకు వెళ్తే జ‌రిగే ప‌రిణామం మాత్ర‌మే.

 

ఈసారి రికార్టు స్థాయిలో జనసేన క్రియాశీల సభ్యత్వాలు || Janasena party active membership registration

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper
Exit mobile version