Twins: తల్లి గర్భంలో కవలలు ఎలా పుడతారు? వారి పుట్టుకకు కారణాలేంటి? వారు ఎందుకు పుడతారు? అనే విషయాల మీద అందరికి ఆసక్తి ఉంటుంది. కవలల పుట్టుక గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. తల్లి గర్భంలో ఒకే సమయంలో రెండు పిండాలు ఏర్పడితే కవలు పుడతారు. అవి రకరకాలుగా ఉంటాయి. అందులో ఒకటి మోనోజైగోట్. దీన్ని ఐడెంటికల్ అంటారు. ఒకే కాలంలో రెండు శుక్రకణాలు అండంతో కలిసినప్పుడు ఏర్పడుతుంది. జైగోట్ రెండు పిండాలుగా ఉంటుంది.

ఇలాంటి సమయంలో పుట్టబోయే పిల్లలు ఒకరు మగ, ఒకరు ఆడ కావొచ్చు. ఇక రెండోది డై జోగోట్. దీన్ని నాన్ ఐడెంటికల్ లేక ప్రేటర్నర్ అని పిలుస్తారు. రెండు అండాలు రెండు శుక్రకణాలతో కలుస్తాయి. ఇలాంటి సందర్భంలో ఒకరు ఆడ, ఒకరు మగ లేదా ఇద్దరు ఆడ, ఇద్దరు మగ గా కూడా అయ్యే చాన్సుంది. మోనోజైగోట్ కవలలను అవిభక్త కవలలుగా చెబుతారు. ఫలదీకరణ తరువాత 12 రోజులకు వేరువేరు శరీరాలు ఏర్పడటంలో వైఫల్యం చెందితే ఇలా పుడతారు.
ప్రసవం తరువాత వారిని వేరు చేసే చికిత్సలు కూడా వచ్చాయి. కానీ వారు గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వేరువేరుగా ఉంటేనే ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే వారు జీవితాంతం కలిసే ఉండాలి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీణ, వాణి అలా జన్మించిన అవిభక్త కవలలే కావడం గమనార్హం. సంతాన లేమితో బాధపడే వారికి ఐవీఎఫ్ సెంటర్లు రెండు పిండాలు గర్భంలో ప్రవేశపెడతారు. ఇందులో ఒకటి వైఫల్యం చెందినా ఇంకోటి శిశువుగా మారుతుందనే ఉద్దేశంతో అలా చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో రెండు పిండాలు ఆరోగ్యంగా ఉంటే కవలలు పుడతారు.
మొరాకోకు చెందిన హలీమా అనే మహిళ ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇందులో ఐదుగురు ఆడ, నలుగురు మగ పిల్లలు జన్మించారు. చిన్న వయసు లేదా పెద్ద వయసులో గర్భం దాల్చిన మహిళలకు కవలలు పుట్టే చాన్సులు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 16 లక్షల మంది కవలలు జన్మిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.

అమెరికాలో 1980-2009 మధ్య కాలంలో కవలల జనన రేటు గణనీయంగా పెరిగింది. అక్కడ వెయ్యి మందికి గాను 18 శాతం మంది కవలలు పుడుతున్నారని చెబుతున్నారు. వీరి రేటు 33.3 మంది కవలలు జన్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికాలోని యోరుబా జాతిలో కవలలు ఎక్కువగా పుడుతున్నారట. ప్రతి వెయ్యి మందిలో 90-100 మంది కవలలు జన్మిస్తున్నారు. యామ్ అనే మొక్కకు కాసిన కూరగాయలను తినడం వల్ల అలా జరుగుతోందని కొన్ని పరిశోధనల్లో రుజువైంది.
ప్రస్తుతం మనం తీసుకుంటున్న డెయిరీ ఉత్పత్తుల మూలంగా కవలలు పుట్టే అవకాశాలున్నాయి. 2006లో నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం తెలిసింది. పశువులకు ఇచ్చే పెరుగుదల హార్మోన్ ఇందుకు దోహదం చేస్తున్నట్లు చెబుతున్నారు.