Diabetes: ఇటీవల కాలంలో మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. మన దేశం షుగర్ రాజధానిగా మారుతోంది. మనకే ఎందుకు చక్కెర వస్తుందంటే అన్నం మన దేశంలో చైనాలో కూడా ఎక్కువగా తింటున్నారు. దీంతో రెండు దేశాలు మధుమేహానికి అడ్డాగా మారుతున్నాయి. మనదేశంలో తాజాగా తెలిసిన పరిశోధనల్లో దాదాపు 15 శాతం మందికి షుగర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అవగాహన లేకపోవడమే. విచ్చలవిడిగా తినడం రోగం తెచ్చుకోవడం దీంతో మందులు మింగడం ఓ అలవాటుగా మారింది.

పూర్వం రోజుల్లో షుగర్ వస్తే ఇక పోదని చెప్పేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనంటున్నారు.కాకపోతే మనం నోరును కాస్త క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఏది పడితే అది తిని రోగాన్ని పెంచుకునే బదులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు వ్యాధి నుంచి ఉపశమనం లభించడం ఖాయమే అని చెబుతున్నారు. దీనికి గాను కఠినమైన విధానాలేవి అక్కరలేదు. రోజు మనం తినే ఆహారమే తినొచ్చు. కాకపోతే దానికి తగిన వాటిని ఎంచుకుని తినడమే. దీంతో మధుమేహం మన దరిదాపుల్లోకి కూడా రాదని వెల్లడిస్తున్నారు.
మధుమేహం ఉన్న వారు మొదట చేయాల్సింది రైస్ ను దూరం చేయడం. తెల్ల ఉత్పత్తులు తినకుండా నియంత్రణలో ఉండాలి. బియ్యం, ఉప్పు, కారం, నూనె వాడకాన్ని తగ్గించాలి. అవి లేకుండా తింటే ఇంకా మంచిది. మొదటి ఆహారంగా తినాల్సినవి ఆకుకూరలు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే వారంలో కనీసం నాలుగు సార్లయినా ఆకుకూరలు వండుకోవాల్సిందే. అన్నం తక్కువ కూర ఎక్కువగా పెట్టుకుని తినడం వల్ల మనకు మంచి ప్రొటీన్లు అంది ఎంతో మేలు కలుగుతుంది.

రెండోది ధాన్యాలు తీసుకోవాలి. రాగి, జొన్న, సజ్జ, ఉలవలు, పెసలు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో రాగికి మరింత మంచి స్థానం ఉంటుంది. రాగిని రొట్టె, జావ, సంకటిగా ఉపయోగించుకుని తింటే ఎంతో ప్రయోజనం. మూడోది స్ర్రా బెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ పండ్లు, బ్లాక్ బెర్రీ అల్లనేరేడు పండ్లు. ఇవి షుగర్ ను కంట్రోల్ లో ఉంచడంలో ప్రథమ స్థానంలో ఉంటయి. వీటిని దొరికినప్పుడల్లా తినడం వల్ల మన శరీరంలో షుగర్ లెవల్స్ బాగా తగ్గుతాయి. ఇవి దొరికినప్పుడు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.
ఇంకా దానిమ్మ, నిమ్మ, నారింజ వంటి పండ్లు తీసుకోవడం ఎంతో మేలు. దీని వల్ల కూడా షుగర్ నియంత్రణలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో సిట్ర జాతికి చెందిన పండ్లను తీసుకోవడం ఉత్తమం. ఇవి తింటే జలుబు చేస్తుందని ఓ అపోహ ఉంది. ఇందులో నిజం లేదు. ఇక చిక్కుడు జాతికి చెందినవి తీసుకుంటే మేలు. ఇందులో చిక్కుళ్లు, బఠానీలు, సోయా, రాజ్ మా, శనగలు వంటివి కూడా తీసుకుంటాం. వీటి వల్ల కూడా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా వీటిని ఆహారంలో చేర్చుకుని మధుమేహం లేకుండా చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.