https://oktelugu.com/

Lion : సింహం తన పిల్లలకు వేటలో ట్రైనింగ్ ఎలా ఇస్తుందంటే.. చూస్తే ఒళ్ళు జలదరించాల్సిందే.. వైరల్ వీడియో

ఆ తర్వాత అదును చూసి ఆ జంతువును చంపేస్తుందట. కాగా, యూట్యూబ్లో ఇన్ సైట్స్ ద్వారా పోస్ట్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

Written By:
  • NARESH
  • , Updated On : May 8, 2024 8:06 pm
    Lions

    Lions

    Follow us on

    Lion : అడవిలో ఉండే క్రూర మృగాలలో సింహం స్థానం ప్రత్యేకమైనది. అడవికి రాజుగా కొనసాగే ఆ జంతువు.. వేటలో ప్రత్యేకమైన శైలిని అనుసరిస్తుంది. ఎంతటి జంతువునైనా అవలీలగా వేటాడుతుంది. తను వేటాడే జంతువు గొంతును తన పదునైన దంతాలతో పట్టుకొని చీల్చి చంపేస్తుంది.. తన ఆకలి మొత్తం తీరేదాకా అక్కడే ఉండి.. చనిపోయిన జంతువు శరీర భాగాలను ఇష్టంగా ఆరగిస్తుంది. అందుకే సింహం అంటే ఎలాంటి జంతువులైనా భయపడుతుంటాయి. సింహం ఆ స్థాయిలో వేటాడుతుంది కాబట్టే సింహ స్వప్నం అనే నానుడి స్థిరపడిపోయింది.

    ముందుగానే చెప్పినట్టు సింహం వేటాడే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే అది తన పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. యూట్యూబ్లో @insights లో సింహం తన పిల్లలకు వేటలో శిక్షణ ఇస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దట్టమైన అడవిలో కొంతమంది పర్యాటకులు తమ కార్లలో ఒక దారిలో ఉన్నారు. ఆ దారి వెంట ఒక తల్లి సింహం.. తన పిల్లలతో కలిసి వెళ్తోంది. ఆ పిల్లలు రెండు నుంచి మూడు నెలల వయసు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. తల్లి సింహం వెళుతుంటే.. పిల్ల సింహాలు దానిని అనుసరిస్తున్నాయి.. మిగతా జంతువుల బారి నుంచి ఎలా రక్షణ పొందాలో ఆ తల్లి సింహం ఆ పిల్ల సింహాలకు నేర్పినట్టుగా ఆ వీడియోలో కనిపిస్తోంది.. వాస్తవానికి ఏదైనా జంతువును వేటాడుతున్నప్పుడు ఆడ సింహం తన పిల్లలను పక్కన పెట్టుకుంటుందట. అది వేటాడుతున్నప్పుడు ఆ పిల్ల సింహాలు చూసి అలాగే చేస్తాయట. మాంసాన్ని తినే విధానాన్ని కూడా తల్లి సింహం పిల్ల సింహాలకు నేర్పుతుందట. ఇలాంటి వ్యవహారాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ మగసింహం జోక్యం చేసుకోదట. అలాంటి పరిస్థితి వస్తే అది దూరంగా వెళుతుందట.

    ఇక పిల్ల సింహాలు తల్లి సింహం వద్ద కొన్ని నెలలపాటే పాలు తాగుతాయట. ఆ తర్వాత అవి వేటను మొదలుపెడతాయట. చిన్న చిన్న జింకలను వేటాడిన తర్వాత.. ఆ అనుభవంతో మిగతా జంతువులను వేటాడుతాయట. అలా వేటాడే క్రమంలో కొన్నిసార్లు సింహం పిల్లలు చనిపోతాయట. ఎక్కువసార్లు మాత్రం తల్లి పర్యవేక్షణలోనే పిల్ల సింహాలు ఇతర జంతువులను వేటాడుతాయట. అనుకోని పరిస్థితుల్లో మాత్రమే పిల్ల సింహాలు వేటకు వెళ్తాయట. పిల్ల సింహాలు ఒకవేళ వేటలో చనిపోతే.. తల్లి సింహం ఆ సంఘటనా స్థలాన్ని వాసన ద్వారా పసిగడుతుందట. పిల్ల సింహం శరీరంపై అయిన గాయాలను చూసి.. ఏ జంతువు చంపిందో గుర్తిస్తుందట. ఆ తర్వాత అదును చూసి ఆ జంతువును చంపేస్తుందట. కాగా, యూట్యూబ్లో ఇన్ సైట్స్ ద్వారా పోస్ట్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

    6 Tiny Lion Cubs Race to Keep Up with Mommy