https://oktelugu.com/

SRH vs LSG : ఇంకో మూడు కొడితే చాలు.. హైదరాబాద్ ఎక్కడికో వెళ్తుంది..

అయితే ఈ మ్యాచ్ ద్వారా మరో అరుదైన రికార్డుకు హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానం చేరువైంది. హైదరాబాద్ గడ్డపై ఐపిఎల్ సీజన్ 1000 సిక్స్ ల మార్క్ దాటేందుకు కేవలం 3 సిక్స్ ల దూరంలో ఉంది.

Written By: , Updated On : May 8, 2024 / 07:55 PM IST
srh-vs-lsg-ipl-2024-preview-spor

srh-vs-lsg-ipl-2024-preview-spor

Follow us on

SRH vs LSG : ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా హైదరాబాద్ జట్టు లక్నోతో కీలక మ్యాచ్ ఆడుతోంది. మొన్నటిదాకా లక్నో జట్టు హైదరాబాద్ కు సమవుజ్జిగా ఉంది. ప్లే ఆఫ్ ముందు లక్నో జట్టు ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలోకి పడిపోయింది. ఇక మంగళవారం రాత్రి రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించడంతో.. ఐదవ స్థానం నుంచి ఆరవ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లాలంటే కచ్చితంగా హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్లో గెలవాలి. దాంతోపాటు త్వరలో ఆడే అన్ని మ్యాచ్ లను గెలుచుకోవాలి. అప్పుడే ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలుంటాయి. అయితే బుధవారం జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ కే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే హైదరాబాద్ 14 పాయింట్లతో ప్లే ఆఫ్ కు మరింత దగ్గరవుతుంది. 14 పాయింట్లతో మూడవ స్థానానికి చేరుకుంటుంది.

హైదరాబాద్ జట్టు 11 మ్యాచ్లలో ఆరింట్లో విజయం సాధించింది. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీ, లక్నో జట్లు కూడా 12 పాయింట్లు కలిగి ఉన్నాయి. అయితే బుధవారం నాటి మ్యాచ్లో హైదరాబాద్ గెలిస్తే.. ఈ మూడు జట్లతో సంబంధం లేకుండా.. నెట్ రన్ రేట్ లాంటి కొరకుడు పడని లెక్కలతో అవసరం లేకుండా..సన్ రైజర్స్ ప్లే ఆఫ్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది.

అయితే ఈ మ్యాచ్ ద్వారా మరో అరుదైన రికార్డుకు హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానం చేరువైంది. హైదరాబాద్ గడ్డపై ఐపిఎల్ సీజన్ 1000 సిక్స్ ల మార్క్ దాటేందుకు కేవలం 3 సిక్స్ ల దూరంలో ఉంది. గత సీజన్లో 1,124 సిక్స్ లు నమోదయ్యాయి. ఈ సీజన్లో 56 మ్యాచ్ లలోనే 997 సిక్స్ లను ఆటగాళ్లు బాదేశారు. ఇంకా 15 మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఈ సీజన్ ముగిసేనాటికి గత సీజన్లో నమోదైన 1,124 సిక్స్ ల రికార్డు కచ్చితంగా బద్దలై పోతుంది. ఇక ఇప్పటివరకు అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో కోల్ కతా ఆటగాడు సునీల్ నరైన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు ఈ టోర్నీలో ఇప్పటివరకు 32 సిక్స్ లు కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ఇప్పటివరకు 31 సిక్స్ లు కొట్టాడు. లక్నోతో జరిగే మ్యాచ్లో అతడు టాప్ స్థానంలోకి వచ్చే అవకాశం లేకపోలేదు.. వీరిద్దరి తర్వాత అభిషేక్ శర్మ 29, రియాన్ పరాగ్ 28, రిషబ్ పంత్ 27, శివం దుబే 26, జెక్ ఫ్రేజర్ 26, విరాట్ కోహ్లీ 24, సంజు శాంసన్ 23, ఫిల్ సాల్ట్ 23 సిక్సర్లతో తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు.