Holi 2025 : రంగుల పండుగ హోలీ కోసం దేశం మొత్తం వెయిట్ చేస్తుంది. రేపు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారా మీరు కూడా. అయితే ప్రతి సంవత్సరం ఈ పండుగను ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ క్రమంలో, ఈ సంవత్సరం మార్చి 14న హోలీ జరుపుకుంటున్నారు. ఇది హిందూ మత ప్రధాన పండుగలలో ఒకటి ఈ హోలీ. దీనిని దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో వివిధ రకంగా జరుపుకుంటారు. హోలీ ఆడటానికి ఇష్టపడని వారు ఎవరూ ఉండరు, కానీ భారతదేశంలో కొన్ని ప్రదేశాలలో చాలా సంవత్సరాలుగా హోలీ ఆడని ప్రజలు ఉన్నారని మీకు తెలుసా.
హోలీ ఆడటం కాదు.. ఈ ప్రదేశాల్లోని ప్రజలు చాలా కాలంగా రంగులను కూడా ముట్టుకోవడం లేదు. కొన్నిసార్లు పౌరాణిక కథలు, కొన్నిసార్లు చారిత్రక సంఘటనలు లేదా సాంస్కృతిక నమ్మకాలు హోలీ పండుగను జరుపుకోకపోవడానికి కారణమవుతాయి. కానీ ఈ రోజు మాత్రం హోలీ ఆడుకొని ప్రాంతాల గురించి తెలుసుకుందాం.
Also Read : హోలీ పండుగ రోజు ఇలా శుభాకాంక్షలు చెప్పి.. ఎదుటివారిని ఆకట్టుకోండి..
తమిళనాడులోని మహాబలిపురం
తమిళనాడులోని మహాబలిపురంలో హోలీ జరుపుకోరు. ఇక్కడి ప్రజలు హోలీ ఆడటానికి బదులుగా, మాసి మాగం అనే మతపరమైన ఆచారాన్ని నిర్వహిస్తారు. ఇక్కడి ప్రజలు ఈ రోజున స్వర్గంలో ఉన్న ఆత్మలు, దేవతలు భూమికి వస్తారని నమ్ముతారు. అందువల్ల, హోలీ రోజున రంగులతో ఆడుకోవడానికి బదులుగా, ఇక్కడ పూజలు, మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు.
రుద్రప్రయాగ, ఉత్తరాఖండ్
పర్వతాలకు, అందాలకు ప్రసిద్ధి చెందిన ఉత్తరాఖండ్‌లోని ఒక ప్రదేశంలో హోలీ పండుగ జరుపుకోరు. నిజానికి, రుద్రప్రయాగ జిల్లాలోని క్విల్లి, కుర్ఝన్ గ్రామాలలో, అధిష్టాన దేవత త్రిపుర సుందరికి శబ్దం అస్సలు ఇష్టం ఉండదని ఒక నమ్మకం ఉంది. కాబట్టి, దేవత ఈ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ హోలీ జరుపుకోరు.
గుజరాత్ లోని బనస్కాంత:
గుజరాత్‌లోని ఒక గ్రామంలో కూడా గత 200 సంవత్సరాలుగా ఎవరూ హోలీ పండుగ జరుపుకోలేదు. రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాలోని రామ్సాన్ గ్రామంలో హోలీ ఆడటంపై నిషేధం ఉంది. నిజానికి, దీని వెనుక ఉన్న కారణం ఒక శాపం. స్థానికులలో ప్రబలంగా ఉన్న ఒక జానపద కథ ప్రకారం, ఒక రాజు చేసిన తప్పుడు పనులకు విసుగు చెందిన కొంతమంది సాధువులు, ఇక్కడ హోలీ జరుపుకుంటే, చెడు రోజులు వస్తాయని గ్రామాన్ని శపించారట.
దుర్గాపూర్, జార్ఖండ్
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోని ఒక గ్రామంలో హోలీ ఆడటం పూర్తిగా నిషేధం. ఇక్కడి దుర్గాపూర్ గ్రామంలో వంద సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన కారణంగా ఈ రోజుల్లో హోలీ జరుపుకోవడం లేదు. ఈ గ్రామ రాజు కుమారుడు హోలీ రోజున మరణించాడని, ఆ తర్వాత విచారించిన రాజు హోలీ జరుపుకోవద్దని ఆదేశించాడని చెబుతుంటారు. అంతేకాదు తరువాత రాజు కూడా హోలీ నాడు మరణించాడట. అందుకే నేటికీ ప్రజలు రాజు ఆజ్ఞను పాటిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
Also Read : హోలీ రోజున మద్యం షాపులు బంద్.. ఎందుకంటే?