Sanitation Workers In Australia: నెలకు రూ.10 వేల వేతనంతో కూడిన ఉద్యోగం వచ్చిందంటే ఎగిరి గంతేస్తాం. కంపెనీ నియమించిందే తరువాయి జాయినవుతాం. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం ఏడాదికి కోటి రూపాయలు ఇస్తామన్నా ఉద్యోగులు దొరకడం లేదు. గంటకు రూ.4 వేలు అందిస్తామన్నా ఎవరూ మొగ్గుచూపడం లేదు. పత్రికల్లో నోటిఫికేషన్లు జారీచేస్తున్నా ఎవరూ దరఖాస్తు చేయడం లేదు. ఇంతకీ ఆ ఉద్యోగం ఏమనుకుంటున్నారా? పారిశుధ్య కార్మిక పోస్టులు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పారిశుధ్య కార్మికులు దొరకని పరిస్థితి. అలాగని ఇది పబ్లిక్ సర్వీసు కాదు. కేవలం ఇళ్లలో కిటికీలు దులపడం, ఇంటిని శుభ్రం చేయం వంటి వాటి కోసమే. కానీ ఆ పనిచేసేందుకు ఆస్ట్రేలియా పౌరులెవరూ ముందుకు రావడం లేదు. అటు క్లీనింగ్ ఏజెన్సీలు ఉన్నా సరిపడనంత మనుషులు అక్కడ లేరు. దీంతో పారిశుధ్య కార్మికులు కావలెను అని పత్రికల్లో, టీవీల్లో సంబంధిత క్లీనింగ్ ఏజెన్సీలు యాడ్ లు ఇవ్వాల్సి వస్తోంది. వార్షిక ఆదాయం కోటి రూపాయల వరకూ ముట్టజెబుతామన్న ఏవరూ ముందుకు రావడం లేదు.

డిమాండ్ ఉండడంతో…
ఆస్ట్రేలియాలో పారిశుధ్య కార్మికులు విపరీతమైన గిరాకీ ఉంది. పెరుగుతున్న జనాల అవసరాలకు తగ్గట్టు అక్కడ పారిశుధ్య కార్మికులు లేరు. కొత్తగా కార్మికులుగా చేరేందుకు ఎవరూ మొగ్గు చూపడం లేదు. దీంతో సంబంధిత క్లీనింగ్ ఏజెన్సీలపై ప్రెజర్ పెరుగుతోంది. ఎంత నగదుచెల్లించడానికైనా అక్కడి పౌరులు సిద్ధపడుతున్నారు. దీంతో పారిశుధ్య కార్మికుల జీతాలను పెంచుతూ అక్కడి క్లీనింగ్ ఏజెన్సీలు నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా డైలీ టెలీగ్రాఫ్ నిజమేనని ధ్రువీకరించింది. గంటల వ్యవధిలోనూ పనిచేసుకోవచ్చని ఏజెన్సీలు ఆఫరిస్తున్నాయి. గంటకు రూ.4,500 వరకూ చెల్లించడానికి కూడా ముందుకొస్తున్నాయి. అటు నెలకు రూ.8 లక్షలతో పాటు ఇతరత్రా అలవెన్సులు సైతం ఇవ్వనున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఏడాది కాంట్రాక్ట్ చేసుకున్నవారికి రూ.కోటి వరకూ వేతనాల రూపంలో చెల్లించడానికి సమ్మతిస్తున్నాయి, కానీ పారిశుధ్య కార్మికులు దొరకని పరిస్థితి నెలకొంది. మరికొన్నాళ్ల పాటు ఆస్ట్రేలియాలో పారిశుధ్య కార్మికుల కొరత ఉంటుందని డైలీ టెలీగ్రాఫ్ చెప్పుకొస్తోంది.

గతంలో బ్రిటన్ లో కూడా సేమ్ సీన్…
గతంలో బ్రిటన్ లో కూడా ఇటువంటి పరిస్థితే ఉండేది. విపరీతమైన పారిశుధ్య కార్మికుల కొరత అక్కడ ఉండేది. భారీ వేతనాల్లో ఆఫర్ చేసినా పెద్దగా ఎవరూ చేరలేదు. కానీ పలు దేశాల నుంచి వెళ్లిన వారితో అక్కడ కార్మికుల లోటు భర్తీ అయ్యింది. ఆస్ట్రేలియాలో కూడా అదే విధంగా భర్తీ అవుతాయని అక్కడ క్లీనింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. దీనికి ఒకటి రెండు సంవత్సరాలు టైము పట్టే అవకాశముందని భావిస్తున్నాయి. ఇప్పటికే ఆయా ఏజెన్సీలు వివిధ దేశాల్లో ప్రకటనలు సైతం జారీచేస్తున్నాయి. గతంలో ఏడాదికి రూ.78లక్షల వరకూ వేతనాల రూపంలో చెల్లించేవారమని.. ఉద్యోగుల కొరత దృష్ట్యా కోటి రూపాయల వరకూ వేతనాన్ని పెంచామని నిర్వాహకులు చెబుతున్నారు. భారతదేశంలో ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ కు చెల్లించే వేతనం ఆస్ట్రేలియాలో పారిశుధ్య కార్మికుడికిచెల్లిస్తుండడం విశేషం. ప్రధానంగాఈ ప్రకటనపై భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు సంబంధిత క్లీనింగ్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు.