https://oktelugu.com/

Megha Akash: హీరోల జీవితాలతో ఆడుకుంటున్న యంగ్ హీరోయిన్… ఇప్పటికే చాలా మంది బలి!

Megha Akash: చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ బాగా ఎక్కువ. హిట్ ఫార్ములా, కాంబినేషన్స్, టైటిల్స్ , హీరోయిన్స్ ఇలా పలు విషయాల్లో సెంటిమెంట్స్ గట్టిగా నమ్ముతారు. అందుకే టాలెంట్ తో సంబంధం లేకుండా హిట్ పెర్సెంటేజ్ ఉన్న హీరోయిన్స్ కి ఆఫర్స్ క్యూ కడతాయి. కాగా యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ ఐరన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడు ఉందంటే ఆ మూవీ కచ్చితంగా ప్లాప్ అవుతుంది. అంతగా సెంటిమెంట్ బలపడిపోయింది. తెలుగులో మేఘా […]

Written By:
  • Shiva
  • , Updated On : April 11, 2023 / 08:05 AM IST
    Follow us on

    Megha Akash

    Megha Akash: చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ బాగా ఎక్కువ. హిట్ ఫార్ములా, కాంబినేషన్స్, టైటిల్స్ , హీరోయిన్స్ ఇలా పలు విషయాల్లో సెంటిమెంట్స్ గట్టిగా నమ్ముతారు. అందుకే టాలెంట్ తో సంబంధం లేకుండా హిట్ పెర్సెంటేజ్ ఉన్న హీరోయిన్స్ కి ఆఫర్స్ క్యూ కడతాయి. కాగా యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ ఐరన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడు ఉందంటే ఆ మూవీ కచ్చితంగా ప్లాప్ అవుతుంది. అంతగా సెంటిమెంట్ బలపడిపోయింది. తెలుగులో మేఘా ఆకాష్ అరడజనుకు పైగా చిత్రాలు చేశారు. ఒక్కటి కూడా విజయం సాధించలేదు.

    హీరో నితిన్ ఈ చెన్నై బ్యూటీని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. లై మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన లై మూవీ కాన్సెప్ట్ నచ్చినా జనాలకు కనెక్ట్ కాలేదు. యాక్షన్ థ్రిల్లర్ లై ప్లాప్ అయ్యింది. వెంటనే మరో మూవీలో నితిన్ ఛాన్స్ ఇచ్చాడు. త్రివిక్రమ్ నిర్మాతగా తెరకెక్కిన చల్ మోహన్ రంగ మూవీలో మేఘా ఆకాష్ నటించింది. ఇది కూడా ప్లాప్.

    Megha Akash

    ఆ దెబ్బతో తెలుగులో ఆఫర్స్ ఆగాయి. వరుసగా తమిళంలో చిత్రాలు చేసింది. అక్కడ కూడా ఆమెకు బ్రేక్ ఇచ్చే హిట్ పడలేదు. రజినీకాంత్ పేట మూవీలో ఓ కీలక రోల్ చేసింది. ఆ మూవీ రిజల్ట్ అంతంత మాత్రమే. హిందీలో సల్మాన్ ఖాన్ కి భారీ ప్లాప్ ఇచ్చింది. రాధే మూవీలో ఓ రోల్ చేయగా అది చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

    కొంచెం గ్యాప్ ఇచ్చి తెలుగులో వరుసగా చిత్రాలు చేశారు. రాజ రాజ చోర మూవీలో శ్రీవిష్ణుతో జతకట్టింది. ఈ మూవీ మాత్రం పర్లేదు అనిపించుకుంది. డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం అట్టర్ ప్లాప్ అయ్యాయి. తాజాగా రావణాసుర మూవీతో తన ట్రాక్ రికార్డు కంటిన్యూ చేసింది. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన రావణాసుర ప్లాప్ టాక్ తెచ్చుకుంది. రవితేజ స్పీడ్ కి బ్రేకులు వేసింది. అలా మేఘా ఆకాష్ ఉంటే మూవీ ప్లాప్ అనే సెంటిమెంట్ బలపడింది. విచిత్రం ఏమిటంటే… ఇన్ని ప్లాప్స్ పడ్డా ఆమెకు ఆఫర్స్ తగ్గడం లేదు.