Anasuya Bharadwaj: బుల్లితెరపై గ్లామర్ షోకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ముద్దుగుమ్మ అనసూయ. పెళ్లయినా తర్వాత తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. నాలుగు పదుల వయసులో కూడా హాట్ అందాలతో రెచ్చిపోతోంది. బుల్లితెరపై యాంకర్‌గా అనేక షోలు చేసిన ఈమె తన గ్రామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనసూయలా మరికొందరు కూడా ప్రయత్నించినా అంతగా గుర్తింపు సంపాదించలేకపోయారు. అందుకే బుల్లితెర గ్రామర్ డాల్ అని అనసూయకు బిరుదు కూడా లభించింది. బుల్లితెర షోలు చేస్తూనే వెండితెరపై కూడా మెరుస్తోంది అనసూయ. మొదటిసారి నాగ సినిమాలో స్టూడెంట్ క్యారెక్టర్‌లో నటించిన అనసూయ ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి ఒక కంపెనీలో హెచ్‌ఆర్ గా కూడా పనిచేసింది. ఆ తర్వాత సాక్షి న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్‌గా అవకాశం రావడంతో అక్కడ కొన్ని రోజులు పనిచేసి, ఆ తర్వాత జబర్దస్త్ వేదికపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
జబర్దస్త్‌కు కేరాఫ్‌గా..
2013లో మొదలైన జబర్దస్త్ కామెడీ షో నిర్విరామంగా 9 సంవత్సరాల విజయవంతంగా పూర్తి చేసుకున్న తరుణంలో ఇన్ని సంవత్సరాలు అనసూయ తన అందంతో.. యాంకరింగ్ తో .. చలాకితనంతో ప్రేక్షకులను అలరించింది అనసూయ. షో విజయవంతంలో కమెడియన్ల పాత్ర ఎంత ఉందో… యాంకర్ అనసూయ పాత్ర కూడా అంతే ఉంది. బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంది ఈ ముద్దుగుమ్మ. క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో తన మార్కును ప్రూవ్ చేసుకుంది. ఇక లేడీ∙ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూనే మరొకవైపు పలు ఐటమ్ సాంగ్‌లకు గ్లామర్ అద్దింది. బుల్లితెరపై మాత్రమే కాదు వెండితెరపై అలాగే వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్న అనసూయ త్వరలోనే జబర్దస్త్ కామెడీ షోకి స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది.
Also Read: Ponniyin Selvan 1: ‘పొన్నియిన్ సెల్వన్ 1’లో పాత్రలు, వాటి చరిత్రలు ఇవే !
వెండితెరపై వెలిగేందుకే..
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటారు నటీనటులు. ఇప్పుడు అనసూయ కూడా ఇదే సూత్రం పాటింస్తోంది పెళ్లయి.. నాలుగు పదుల వయసు దాటినా ఆఫర్లు వస్తుండడంతో బుల్లితెర షోలు, వెండితెర సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేయడం అనసూయకు కష్టంగా మారుతోంది. ఇటీవల మాటీవీలో ఒక ప్రోగ్రాంకి యాంకగర్ వ్యవహరించింది. కానీ అందరూ కూడా ఈ షో కోసమే జబర్దస్త్ ను వీడనుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇందులో నిజం లేదని తాజాగా సమాచారం. అసలు విషయం ఏమిటంటే అనసూయ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. ఇక వెబ్ సిరీస్‌లో ఆమె వ్యాంప్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. గురజాడ కన్యాశుల్కం నాటిక ఆధారంగా తీస్తున్న ఈ వెబ్ సిరీస్ లో మధురవాణి లాంటి క్యారెక్టర్‌లో అనసూయ నటిస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్‌కి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, రంగ మార్తాండ, పుష్ప 2 లో ఈమె నటిస్తూ వుండడం వల్ల ఆమె జబర్దస్త్ కి గుడ్‌బై చెప్పినట్లు సమాచారం. వెండితెర అవకాశాలు ఉన్ననిన రోజులు బుల్లితెరకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
Also Read:Actress Priya Anand: నిత్యానంద స్వామితోనే తన పెళ్లి.. ప్రముఖ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం