
Poorna Baby Bump Photos: పుత్తడి బొమ్మ పూర్ణ తల్లి కాబోతుంది. నిండు గర్భంతో ఫోటో షూట్ చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. పాల రోజా రంగు గౌన్ ధరించిన పూర్ణ మెస్మరైజ్ చేస్తున్నారు. బేబీ బంప్ లో నవ్వులు చిందిస్తూ పూర్ణ మనసులు దోచేశారు. పూర్ణ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇక ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. కాగా కొద్దిరోజుల్లో పూర్ణ ఫ్యామిలీలోకి కొత్త అతిథి రానున్నాడు.
గత ఏడాది పూర్ణ వివాహం చేసుకున్నారు. పూర్ణ భర్త దుబాయ్ లో వ్యాపారవేత్త. ఆయన పేరు షానిద్ అసిఫ్ అలీ. పెద్ద కోటీశ్వరుడని సమాచారం. పూర్ణకు పెళ్లికానుకగా విలువైన నగలు ఇచ్చాడు. అయితే వీరి పెళ్లి బంధు మిత్రుల మధ్య మీడియాకు తెలియకుండా జరిగింది. పూర్ణకు పెళ్ళైన విషయం ఎవరికీ తెలియదు. ఎంగేజ్మెంట్ జరిగిన నెలలు గడుస్తున్నా వివాహం జరగకపోవడంతో పెళ్లి క్యాన్సిల్ అంటూ పుకార్లు లేచాయి.
అయితే 2022 జూన్ నెలలో దుబాయ్ వేదికగా వివాహం జరిగిందని చెప్పి షాక్ ఇచ్చింది. బంధు మిత్రుల కోసం కేరళలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పారు. కానీ పూర్ణ ఎలాంటి రిసెప్షన్ జరపలేదు. గత ఏడాది చివర్లో తాను తల్లి అయినట్లు పూర్ణ ప్రకటించారు. ఇక పెళ్లి తర్వాత కూడా పూర్ణ కెరీర్ సాగిస్తున్నారు. 2022లో పూర్ణ తీస్ మార్ ఖాన్ చిత్రంలో నటించారు. ఆది హీరోగా నటించిన తీస్ మార్ ఖాన్ అనుకున్న స్థాయిలో ఆడలేదు.

2021 పూర్ణకు బాగా కలిసొచ్చింది. అఖండ, దృశ్యం 2 వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. సిల్వర్ స్క్రీన్ పై కీలక రోల్స్ చేస్తూనే బుల్లితెర షోలలో సందడి చేస్తున్నారు. ఢీ డాన్స్ రియాలిటీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లో పూర్ణ తళుక్కున మెరుస్తూ ఉంటారు. ఢీ జడ్జిగా పూర్ణ ఊహించని చర్యలకు పాల్పడ్డారు. పూర్ణ మేల్ డాన్సర్స్ బుగ్గలు కొరకడం, ముద్దులు ఇవ్వడం సంచలనమైంది.
ఇక పూర్ణకు మంచి ఆరంభం లభించింది. సీమటపాకాయ్, అవును హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఆమె లాంగ్ కెరీర్ కి పునాది వేసుకోలేకపోయారు. హీరోయిన్ గా కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కాగా కేరళలో కొందరు దుండగులు ఆమెకు టెర్రర్ చూపించారు. స్మగ్లింగ్ చేయడానికి సహకరించాలని ఆమెను నిర్బంధించారు. అప్పట్లో ఈ న్యూస్ సంచలనమైంది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యింది.
