Actress Poonam Kaur: సినిమా తారల జీవితం పైకి కనిపిస్తున్నంత అందంగా ఉండదు. వారి లైఫ్ స్టైల్ రీత్యా అనేక వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుంది. ఒక టైం అంటూ లేని జాబ్ వాళ్ళది. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. గత కొన్ని రోజులుగా పలువురు స్టార్స్ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. సమంత స్వయంగా మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డట్లు తెలియజేశారు. కండరాల వాపుకు సంబంధించిన ఆ అరుదైన రుగ్మతలకు ఆమె చికిత్స తీసుకుకుంటున్నారు. అతిగా వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడి కారణంగా సమంత మయోసైటిస్ కి గురయ్యారనే వాదన తెరపైకి వచ్చింది.

అలాగే మరో నటి కల్పికా గణేష్ అదే వ్యాధికి గురైనట్లు వెల్లడించారు. సమంత థర్డ్ స్టేజ్ లో ఉన్నారు. నేను ఫస్ట్ స్టేజ్ మయోసైటిస్ తో బాధపడుతున్నాను. ఈ విషయమై సమంతను ఒకసారి కలవాలి, అంటూ కల్పిక చెప్పుకొచ్చారు. సమంత లేటెస్ట్ హిట్ యశోద చిత్రంలో కల్పిక నటించారు. ఇదిలా ఉండగా నటి పూనమ్ కౌర్ సైతం దీర్ఘకాలిక వ్యాధిబారిన పడ్డారట. పూనమ్ ఫైబ్రో మాయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నారట. ఈ వ్యాధి సోకినవారు… అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి కోల్పోవడం, కండరాల నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటారట.
చాలా కాలంగా పూనమ్ కౌర్ ఈ అరుదైన రుగ్మతకు చికిత్స తీసుకుంటున్నారట. కేరళలో ఈ వ్యాధికి చికిత్స ఉందట. అక్కడే ఆమె కొన్నాళ్లుగా వైద్యం చేయించుకుంటున్నారట.చాలా యాక్టీవ్ గా కనిపించే పూనమ్ కి ఇంత భయంకరమైన వ్యాధి ఉందా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

ఇక 2006లో పూనమ్ కౌర్ హీరోయిన్ గా అడుగుపెట్టారు. అయితే ఆమెకు సరైన బ్రేక్ రాలేదు.పూనమ్ అడపదడపా సినిమాలు చేస్తూ వస్తున్నారు. పూనమ్ కౌర్ చివరి చిత్రం నాతిచరామి. ఇక సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ చాలా యాక్టీవ్. ఆమె తరచుగా కాంట్రవర్సీ ట్వీట్స్ వేస్తూ ఉంటారు. పూనమ్ కౌర్ సోషల్ మీడియా పోస్ట్స్ పరోక్షంగా ఎవరినో టార్గెట్ చేసినట్లుగా ఉంటాయి. ఇటీవల పూనమ్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో చేయి కలిపి నడిచారు. ఇది వివాదాస్పదమైంది. అయితే విమర్శకులకు పూనమ్ తనదైన శైలిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది.