Nagarjuna Shiva Movie: యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయిన చిత్రం ‘శివ’..రామ్ గోపాల్ వర్మ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..అప్పటి వరుకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని ఈ సినిమా బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..నాగార్జున ని మాస్ హీరో గా ఒక రేంజ్ లో నిలబెట్టింది ఈ చిత్రం..ముఖ్యంగా సైకిల్ చైన్ ట్రెండ్ అప్పట్లో ఒక సెన్సేషన్..యూత్ మొత్తం సైకిల్ చైన్ ట్రెండ్ కి బాగా ప్రభావితం అయ్యారు.
ఇక రామ్ గోపాల్ వర్మ టెక్నిషియన్ గా ఈ సినిమాకి వాడిన కెమెరా యాంగిల్స్ కొత్త దర్శకులకు ఫిలిం స్కూల్స్ లో టీచింగ్ కోసం ఉపయోగించొచ్చు..అంత ప్రతిభని ఈ సినిమా లో చూపిస్తాడు ఆయన..అలాంటి దర్శకుడు ఇప్పుడు బూతు సినిమాలు తీసుకుంటూ, కాంట్రవర్సీనే ఊపిరి గా పీలుస్తూ తన కెరీర్ ని నెట్టుకొస్తాడని అప్పట్లో ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు.
అయితే ఈ సినిమా నిర్మాత ప్రవీణ్ రెడ్డి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ చిత్రం గురించి ఎదురైనా అనుభవాలను పంచుకున్నాడు..ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో వజ్రం మరియు శివ సినిమాలు ఒకే ఏడాది లో విడుదలయ్యాయి..వజ్రం చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిలవగా, శివ చిత్రం మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది’ అని చెప్పుకొచ్చారు..ఇక అప్పట్లో శివ చిత్రం ప్రభావం జనాల పై ఎలా ఉండేదో చెప్పుకొచ్చాడు ప్రవీణ్ రెడ్డి..అప్పట్లో ఈ సినిమాని చూసి ఆత్మకూరు లో మర్డర్స్ జరిగాయని..సైకిల్ చైన్స్ పాకెట్ లో పెట్టుకొని అప్పటి రౌడీలు తిరిగేవారని చెప్పుకొచ్చాడు ప్రవీణ్ రెడ్డి..అంతలా ఈ చిత్రం జనాలను ప్రభావితం చేసిందని.
రామ్ గోపాల్ వర్మ పై అప్పట్లో కొన్ని సంఘాలు ఈ విషమై ధర్నాలు కూడా చేసేవారని చెప్పుకొచ్చారు ప్రవీణ్ రెడ్డి..ఇంకా ఆయన మాట్లాడుతూ గీతాంజలి సినిమాకి అప్పట్లో ప్రారంభం లో పెద్దగా టాక్ రాలేదని..అది స్లో గా హిట్ అయ్యిందని..కానీ శివ సినిమాకి మాత్రం మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చిందని చెప్పుకొచ్చారు ప్రవీణ్ రెడ్డి.