https://oktelugu.com/

Kajal Aggarwal: ఎద ఎత్తులు చూపిస్తూ పిచ్చెక్కించిన కాజల్… పెళ్ళైనా పరువాల పవర్ తగ్గలేదంటున్న నెటిజెన్స్!

Kajal Aggarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జోరు చూపిస్తున్నారు. స్టార్స్ పక్కన ఆఫర్స్ పట్టేస్తూ తనకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. కాజల్ చేతిలో రెండు బడా ప్రాజెక్ట్ ఉన్నాయి. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 చిత్రం మీద దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. 1996లో వీరి కాంబోలో తెరకెక్కిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. దర్శకుడు శంకర్ తో నిర్మాతలకు విభేదాలు తలెత్తడంతో ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ఆగిపోయిన ప్రాజెక్ట్ ఇటీవల […]

Written By:
  • Shiva
  • , Updated On : April 3, 2023 / 01:20 PM IST
    Follow us on

    Kajal Aggarwal

    Kajal Aggarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జోరు చూపిస్తున్నారు. స్టార్స్ పక్కన ఆఫర్స్ పట్టేస్తూ తనకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. కాజల్ చేతిలో రెండు బడా ప్రాజెక్ట్ ఉన్నాయి. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 చిత్రం మీద దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. 1996లో వీరి కాంబోలో తెరకెక్కిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. దర్శకుడు శంకర్ తో నిర్మాతలకు విభేదాలు తలెత్తడంతో ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ఆగిపోయిన ప్రాజెక్ట్ ఇటీవల పట్టాలెక్కించారు.

    భారతీయుడు 2 విజయం సాధించిన నేపథ్యంలో కాజల్ కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది. కాగా బాలయ్యకు జంటగా మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న బాలయ్య 108వ చిత్రంలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూట్లో కాజల్ పాల్గొంటున్నారు. శ్రీలీల కీలక రోల్ చేస్తున్నారు.

    దసరా కానుకగా బాలయ్య మూవీ విడుదల కానుంది. కెరీర్లో మొదటిసారి కాజల్-బాలయ్య జతకట్టారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కాజల్ పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సౌత్ ఇండియా స్టార్ లేడీగా ఫేమ్ అనుభవించారు. బాలీవుడ్ లో అడపాదడపా చిత్రాలు చేశారు. ఇటీవల కాజల్ హిందీ చిత్ర పరిశ్రమ మీద ఆరోపణలు చేయడం విశేషం.

    Kajal Aggarwal

    హిందీ చిత్ర పరిశ్రమకు నైతిక విలువలు లేవని కాజల్ అసహనం వ్యక్తం చేశారు. ముంబైలో పుట్టి పెరిగినా తెలుగు, తమిళ భాషల్లో ఆదరించారు. అక్కడ పరిశ్రమల్లో ఆరోగ్యకర వాతావరణం ఉంది. అందుకే గొప్ప సినిమాలు, సాంకేతిక నిపుణులు తయారవుతున్నారని ఆమె అన్నారు. బాలీవుడ్ మీద తనకున్న ఆగ్రహం ఈ కామెంట్స్ తెలియజేస్తున్నాయి.

    మరోవైపు సోషల్ మీడియాలో కాజల్ గ్లామర్ షో కొనసాగుతుంది. ముంబైలో జరిగిన నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ ఈవెంట్ కోసం కాజల్ సూపర్ హాట్ గా తయారయ్యారు. క్లీవేజ్ అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేశారు. కాజల్ బోల్డ్ షో చూసిన నెటిజన్స్ పెళ్ళైనా ఆమెలో పరువాల పవర్ తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. కాజల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.