Homeజాతీయ వార్తలుCool Roof Policy: ఎండ వేడి నుంచి రక్షణకు.. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో...

Cool Roof Policy: ఎండ వేడి నుంచి రక్షణకు.. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా..!

Cool Roof Policy
Cool Roof Policy

Cool Roof Policy: వేసవికాలం వచ్చిందంటే చాలు భానుడి భగభగలకు ప్రజలు విలవిల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎండ వేడిమి వల్ల ఉక్క పోతకు ఇళ్లల్లో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇళ్లల్లో, కార్యాలయాల్లో వేడి పెరిగిపోతుంటుంది. ఈ వేడిని తగ్గించేందుకు తెలంగాణ సర్కార్ కొత్త కార్యాచరణను ప్రారంభించింది. ఈ చర్యలు వల్ల ఇళ్లల్లోనూ, కార్యాలయాల్లో ఉండే వారికి వేడి సమస్య ఉండదు. అదేంటో ఒకసారి చూసేద్దాం.

వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఇల్లు, వాణిజ్య భవనాలు, కార్యాలయాల్లో పడకుండా తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందుకోసం పొరపాలక శాఖ కూల్ రోప్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. తెలంగాణ కూల్ప్ విధానం 2023 – 28న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు. ఐదేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది. దీనికోసం రెండు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్న పురపాలక శాఖ అమలుకు సిద్ధమైంది. హైదరాబాదు నగరంలో 100 చదరపు కిలోమీటర్ల మేర, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతంలో 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కూల్ రూఫ్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విధాన ప్రకటన సందర్భంగా ఐదేళ్ల లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది. స్కూల్ రూఫ్ ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించడం, నగరాల వారీగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా ఏజెన్సీలతో సమన్వయం, వీటి కోసం పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ వంటివి కొత్త విధానంలో ఉండనున్నాయి.

వేసవి తాపం నుంచి రక్షించుకునేందుకు అవకాశం..

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నగరాలు, పట్టణాలు సలసల కాగుతున్నాయి. ఫలితంగా జనం ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి. చల్లదనం కోసం ఏసీలు వినియోగం పెరిగి కాలుష్య ఉద్గారాలు అధికమవుతున్నాయి. ఏసీలు అమర్చుకోలేని సామాన్యులు వేడిమి వల్ల వడదెబ్బ బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. కూల్ రూప్ టాప్ వల్ల భవనాల లోపల వేడి తగ్గి సౌకర్యవంతంగా ఉండడంతో పాటు విద్యుత్తు కూడా ఆదా అవుతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి), నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్, త్రిపుల్ ఐటీ, జిహెచ్ఎంసిలతో కలిసి స్కూల్ రూట్ ఆఫ్ విధానాన్ని తీసుకువస్తుంది. 2019లో ముసాయి దాని విడుదల చేసిన ప్రభుత్వం.. వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి తుది రూపు ఇచ్చింది. హెచ్ఎంసి, ఆస్కీ కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని దేవరకొండ బస్తీలో ప్రయోగాత్మకంగా కూల్ రూప్ టాప్ అమలు చేసి పనితీరును పరిశీలించాయి. హైదరాబాదులో 1468 నోటిఫైడ్ బస్తీలు ఉండగా.. వీటిలో 19 లక్షల జనాభా నివసిస్తున్నారు. ఇరుకిరుకు నివాసాలు, కాంక్రీట్ స్లాబులు, రేకుల ఇళ్లలో ఆయా ప్రాంతాల ప్రజలు ఉండలేని పరిస్తితి. ఈ నివాసాలపై ఉపశమన ఏర్పాట్లు చేయాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుసరించే విధి, విధానాలు, నిధులు మంజూరు వంటి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇదీ కూల్ రూఫ్ విధానం అంటే..

కూల్ రూఫ్ విధానంలో నిర్మించే పై కప్పు వల్ల గది ఉష్ణోగ్రతలు బాగా తగ్గే అవకాశం ఉంది. ఆధునిక సాంకేతికతతో పై కప్పుకు ఉపయోగించే సామగ్రి లో కొన్ని మార్పులు చేయడం, ప్రత్యేక రసాయనాలు వినియోగంతో 5 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా. దీనివల్ల సూర్య కిరణాలు తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందడం ద్వారా ఇంటి లోపలకు వేడి రావడం తగ్గుతుంది. ఇప్పటికే నిర్మించిన భవనాలపై కూల్ రూఫ్ ఏర్పాటుకు పలు పద్ధతులున్నాయి. స్లాబ్ పైన కూల్ పెయింట్ వేయడం, వినైల్ షీట్లను పరచడం, టైల్స్ వేసుకోవడం, భవనాలు పైన మొక్కలు పెంపకం, సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు వంటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

Cool Roof Policy
Cool Roof Policy

కొత్త నిబంధనలు అమలులోకి..

రూఫ్ టాప్ కొత్త విధానం అములుకు కొత్త నిబంధనలు తీసుకురానున్నారు. కొత్తగా కట్టే ప్రభుత్వ, వాణిజ్య భవనాల్లో కూల్ రూఫింగ్ తప్పనిసరి కానుంది. రాష్ట్ర బిల్డింగ్ ఎఫిషియెన్సీ కోడ్ లో భాగంగా దీన్ని అమలు చేయనున్నారు. వాణిజ్య భవనాలకు అనుమతి ప్రక్రియలోనే దీన్ని అనుసంధానం చేయనున్నారు. నిర్దేశిత ప్రమాణాలు మేరకు భవనాలు నిర్మించాల్సి ఉంది. ప్రభుత్వం బలహీన వర్గాల కోసం నిర్మించే ఇళ్లకు కూల్ రూఫ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తారు. ఇప్పటికే ఉన్న వాణిజ్య భవనాల్లో తగు ఏర్పాట్లు కోసం యజమానులు ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్ గృహాలకు ఇది తప్పనిసరి కాదు. కూల్ రూఫ్ ప్రయోజనాలపై అవగాహన కల్పించి ప్రోత్సహిస్తారు.

Exit mobile version