
Bhavana: కేవలం రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల్లో శాశ్వత గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒక్కరు భావన.తెలుగు లో ఈమె ఒంటరి, హీరో మరియు మహాత్మ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. విశేషం ఏమిటంటే ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి లో ఆడలేదు. ఒక్క మహాత్మ సినిమా ఒక్కటే హీరో శ్రీకాంత్ వందవ సినిమా అనే హైప్ కారణం ఒక మోస్తరు గా ఆడేసింది.

మిగిలిన రెండు సినిమాలు అటు గోపీచంద్ మరియు ఇటు నితిన్ కెరీర్ లో భారీ ఫ్లాప్స్ గా నిలిచాయి. సినిమా బాక్స్ ఆఫీస్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ నటిగా ఈమెకి మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఇన్నేళ్లు అయినా, గొప్ప సినిమాల్లో నటించకపోయినా ఈమెని చూడగానే మన తెలుగోళ్లు గుర్తు పెట్టేస్తూ ఉంటారు.

అయితే టాలీవుడ్ లో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయ్యుండొచ్చు కానీ మలయాళం లో ఈమె పెద్ద స్టార్ హీరోయిన్. అక్కడి స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.మలయాళం తర్వాత ఈమె ఎక్కువగా తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇదంతా పక్కన పెడితే ఈమెకి వివాదాలు కూడా తక్కువేమి కాదు, 2017 వ సంవత్సరం లో ఈమె షూటింగ్ కి వెళ్తున్న సమయం లో ఒక గ్యాంగ్ ఈమెని కిడ్నాప్ చేసింది. ఇదంతా చేయించింది మలయాళం స్టార్ హీరో దిలీప్ కుమార్ అని ఆ తర్వాత తెలిసింది.

అతను అరెస్ట్ అయ్యాడు కూడా, ఇక ఆ తర్వాత ఈమె కన్నడ సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖ నిర్మాత నవీన్ 2017 వ సంవత్సరం లో పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా ఈమె సినిమాల్లో నటించడం మానలేదు, ఇప్పటికీ ఈమె చేతిలో మూడు మలయాళం సినిమాలు ఉన్నాయి.అయితే ఈమె రీసెంట్ ఫోటోలను చూసి నెటిజెన్స్ షాక్ కి గురి అవుతున్నారు.ఆ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.