Asha Saini: హీరోయిన్ ఆషా షైనీ తన బాయ్ ఫ్రెండ్ ఎంతటి చిత్రహింసలకు గురి చేశాడో మరోసారి వెల్లడించారు. ఆమెను మాజీ ప్రియుడు దారుణంగా కొట్టాడట. తన దవడ విరగడంతో పాటు తీవ్ర గాయాలపాలయ్యారట. ఇటీవల ఢిల్లీలో శ్రద్ధ వాకర్ అనే యువతిని ప్రియుడు అఫ్తాబ్ హత్య చేశాడు. శ్రద్దా శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో ఉంచాడు. ఆ శరీర భాగాలను రోజుకి కొంత మొత్తంలో జనసంచారం లేని ప్రదేశాల్లో విసిరి వేశాడు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన కలకలం రేపింది.
ఢిల్లీ సంఘటన నేపథ్యంలో హీరోయిన్ ఆషా షైనీ తాను కూడా ఇలాంటి చిత్ర హింసలకు గురైనట్లు చెప్పుకొచ్చారు. గౌరంగ్ దోషిపై ఆషా షైనీ తీవ్ర ఆరోపణలు చేశారు. గౌరంగ్ దింగ్రా నన్ను కొట్టాడు. అతడి దెబ్బలకు నా దవడ విరిగిపోయింది. ఆ దెబ్బలకు తాళలేక నేను భయంతో బయటకు పరుగు తీశాను. ఆ సమయంలో ఒంటిపై బట్టలు ఉన్నాయా లేవా అని కూడా నేను చూసుకోలేదు. అంతగా నన్ను చిత్రహింసలకు గురి చేశాడు. అతన్ని నమ్మినందుకు వేదనకు గురి చేశాడని ఆషా షైనీ చెప్పుకొచ్చింది.
నిర్మాత గౌరంగ్ దోషితో ఆషా షైనీ రిలేషన్ నడిపారు. ఆ సమయంలో ముంబైలో వారు ఒకే నివాసంలో ఉండేవారు. 2007లో ఈ సంఘటన జరిగింది. అయితే గౌరంగ్ వేధింపులపై ఆషా షైనీ 2018లో నోరు విప్పారు. అప్పటి గాయాలతో కూడిన ఫోటోలు ఆమె బయటపెట్టారు. సదరు ఫొటోల్లో ఆషా షైనీ గాయాలతో, దవడ పక్కకు జరిగి భయంకరంగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ప్రియుడు చేతిలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు తెలియజేశారు.
ఆషా షైనీ తెలుగులో చాలా చిత్రాలు చేశారు. ఆమెకు నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ మంచి పేరు తెచ్చాయి. నరసింహ నాయుడు చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ నటించారు. వారిలో ఆషా షైనీ ఒకరు. ఆషా బాలయ్య మరదలు పాత్ర చేశారు. ఆమె నటించిన లక్స్ పాప సాంగ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఆ సాంగ్ పిచ్చ ఫేమస్. అలాగే నువ్వు నాకు నచ్చావ్ మూవీలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఫ్రెండ్ రోల్ చేసింది. కనిపించేది తక్కువ సీన్స్ లోనే అయినా… ఆషా పాత్ర గుర్తిండిపోతుంది. టాలీవుడ్ కి దూరమైన ఆషా ప్రస్తుతం బాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్నారు.