NTR On Oscar: అమెరికాకు పయనమైన ఎన్టీఆర్..!

NTR On Oscar: మరో వారం రోజుల్లో ఆస్కార్ వేడుక జరగనుంది. ఆర్ ఆర్ ఆర్ టీమ్ అమెరికాలో గత నెల రోజులుగా సందడి చేస్తున్నారు. హీరో రామ్ చరణ్ విశేష గౌరవం అందుకుంటున్నారు. రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నారు . ప్రపంచంలో అతిపెద్ద థియేటర్స్ లో ఒకటైన ‘ది థియేటర్ యట్ ఏస్ హోటల్’ లో ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శించారు. 1645 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ థియేటర్ ఆడియన్స్ […]

Written By: Shiva, Updated On : March 6, 2023 10:11 am
Follow us on

NTR On Oscar

NTR On Oscar: మరో వారం రోజుల్లో ఆస్కార్ వేడుక జరగనుంది. ఆర్ ఆర్ ఆర్ టీమ్ అమెరికాలో గత నెల రోజులుగా సందడి చేస్తున్నారు. హీరో రామ్ చరణ్ విశేష గౌరవం అందుకుంటున్నారు. రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నారు . ప్రపంచంలో అతిపెద్ద థియేటర్స్ లో ఒకటైన ‘ది థియేటర్ యట్ ఏస్ హోటల్’ లో ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శించారు. 1645 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ థియేటర్ ఆడియన్స్ తో నిండిపోయింది. మూవీ స్క్రీనింగ్ అనంతరం ఆడియన్స్ స్టాండింగ్ ఒవేషన్ తో టీమ్ కి అభివాదం తెలిపారు. అనంతరం రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: Venu Swamy Love Story: వేణు స్వామికి అంత పెద్ద లవ్ స్టోరీ ఉందా… ప్రియురాల్ని లేపుకుపోయి మరీ!

కాగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ లో ఎన్టీఆర్ మిస్ అయ్యాడు. తన బ్రదర్ తారకరత్న అకాల మరణం నేపథ్యంలో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లడం కుదర్లేదు. ఫిబ్రవరి 2న తారకరత్న పెద్దకర్మ ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. తారకరత్న పెద్దకర్మ ముగియడంతో, ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు అమెరికాకు పయనమయ్యారు. ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ కనిపించగా కెమెరా మెన్ క్లిక్ మనిపించారు. ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.

మార్చి 12న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం లాస్ ఏంజెల్స్ జరగనుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు నామినేటైన విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఈసారి అవార్డు వరిస్తుందని ఇండియన్ ఆడియన్స్ భావిస్తున్నారు. నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో హోప్స్ బలపడ్డాయి. నాటు నాటు ఆస్కార్ గెలుచుకుంటే భారతీయ సినిమా చరిత్రలో అరుదైన ఘటనగా నిలిచిపోతుంది. కాగా నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ వేదికపై సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లైవ్ పర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు.

NTR On Oscar

దర్శకుడు రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. నిర్మాత డివివి దానయ్య రూ. 500 కోట్లతో నిర్మించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్… కొమరం భీమ్, రామరాజు పాత్రల్లో మెప్పించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు. శ్రియ శరన్ సైతం చిన్న పాత్రలో అలరించారు. ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్ల వసూళ్లు సాధించింది.

Also Read: WPL 2023 UP Vs Gujarat: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌: గుజరాత్‌పై అఖరి బంతికి గట్టెక్కిన యూపీ

Tags