మనలో చాలామంది ఎలుకలు అంటే అస్సలు ఇష్టపడరు. ఎలుకలు ఇంట్లోని ఆహారపదార్థాలను, బట్టలను నాశనం చేస్తాయని వాటిని తిట్టుకుంటూ ఉంటారు. రైతులైతే ఎలుకలు పంటపొలాలను నాశనం చేస్తాయని వాటి కోసం కలుగులు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఎలుకల వల్ల మనం పలు వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. చాలామంది ఎలుకల వల్ల ఒక్క లాభం కూడా ఉండదని భావిస్తూ ఉంటారు.
Also Read : సంచలనం: కేంద్రంపై కేసీఆర్ న్యాయపోరాటం?
అయితే ఒక ఎలుక మాత్రం వేల మంది ప్రాణాలను కాపాడింది. మనుషులు కూడా చేయలేని పనిని చేసి గుర్తింపు తెచ్చుకుంది. బాంబులను కనిపిట్టే ఈ ఎలుక గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మనుషుల ప్రాణాలను కాపాడిన ఈ ఎలుకకు గోల్డ్ మెడల్ కూడా దక్కడం గమనార్హం. బ్రిటిష్ వెటర్నరీ ఛారిటీ పీపుల్స్ డిస్పెన్సరీ ఫర్ సిక్ యానిమల్స్ (పిడిఎస్‌ఎ) మగవా అనే ఎలుకకు గోల్డ్ మెడల్ ఇచ్చింది.
ఒక ప్రభుత్వేతర సంస్థ ద్వారా శిక్షణ తీసుకున్న మగవా ఆగ్నేశాసియా దేశంలో ల్యాండ్‌మైన్లను సులభంగా కనిపెట్టగలిగింది. పేలుడు రసాయనాల సువాసనను గుర్తించేలా శిక్షణ తీసుకున్న ఈ ఎలుక ఇప్పటివరకు 28 పేలుడు బాంబులను, 39 ల్యాండ్‌మైన్‌లను కనిపెట్టింది. మనుషులు నాలుగు రోజుల్లో మెటల్ డిటెక్టర్ తో చేసే పనిని మగవా కేవలం అరగంటలోనే చేస్తుంది. సోషల్ మీడియాలో మగవా చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
‘పీడీఎస్ఏ’ గోల్డ్ మెడల్ ను ఇప్పటివరకు 30 జంతువులు అందుకోగా ఈ అవార్డును అందుకున్న మొదటి ఎలుక మాత్రం ఇదే కావడం గమనార్హం. ఇలా ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎలుకలను హీరో రాట్స్ అని పిలుసారు. ఎలుక అందించిన సేవలకు గానూ ఎలుకకు శిక్షణ అందించిన అపోపో కంపెనీకి కూడా పతకం దక్కింది.
Also Read : వైఎస్ వివేకా హత్య: కీలక సమాచారం చెప్పిన ఆ ఇద్దరు మహిళలు?