https://oktelugu.com/

Sivatmika : హీరో రాజశేఖర్ చిన్న కూతురు ఇలా తెగించిందేంటి… శివాత్మిక అలాంటి ఇమేజ్ కోరుకుంటుందా!

Sivatmika : అక్క శివాని కంటే ముందు సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది శివాత్మిక. సీనియర్ హీరో రాజశేఖర్ చిన్న కుమార్తె అయిన శివాత్మిక దొరసాని మూవీతో పరిశ్రమలో అడుగు పెట్టారు. పీరియాడిక్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా దొరసాని తెరకెక్కింది. దొరసాని మూవీలో శివాత్మిక రోల్ అద్భుతంగా పండింది. దొర కూతురిగా రాజసం, పేదవాడి ప్రేయసిగా ప్రేమతో కూడిన కరుణ రెండు షేడ్స్ చక్కగా నటించి చూపించింది. దొరసాని చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ పడ్డాయి. అయితే కమర్షియల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2023 / 09:55 PM IST
    Follow us on

    Sivatmika : అక్క శివాని కంటే ముందు సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది శివాత్మిక. సీనియర్ హీరో రాజశేఖర్ చిన్న కుమార్తె అయిన శివాత్మిక దొరసాని మూవీతో పరిశ్రమలో అడుగు పెట్టారు. పీరియాడిక్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా దొరసాని తెరకెక్కింది. దొరసాని మూవీలో శివాత్మిక రోల్ అద్భుతంగా పండింది. దొర కూతురిగా రాజసం, పేదవాడి ప్రేయసిగా ప్రేమతో కూడిన కరుణ రెండు షేడ్స్ చక్కగా నటించి చూపించింది. దొరసాని చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ పడ్డాయి. అయితే కమర్షియల్ గా ఆడలేదు. తెలుగు ప్రేక్షకులు భగ్న ప్రేమలను పెద్దగా ఆదరించరు. హీరో లేదా హీరోయిన్ చనిపోతే సహించలేరు.

    ట్రాజిక్ లవ్ స్టోరీ కావడం వల్లనేమో కానీ కంటెంట్ ఉండి కూడా దొరసాని ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. దొరసాని మూవీతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమయ్యాడు. దొరసాని విడుదలై మూడేళ్లు దాటిపోయింది. ఇంకా శివాత్మికకు బ్రేక్ ఇచ్చే మూవీ పడలేదు. ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఇమేజ్ రావడం లేదు.

    తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో శివాత్మిక సినిమాలు చేస్తున్నారు. ఆమె నటించిన తమిళ చిత్రం ఆకాశం టైటిల్ తో తెలుగులో విడుదల చేశారు. డబ్బింగ్ మూవీ లెక్కలో మన ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇటీవల పంచతంత్రం మూవీతో ప్రేక్షకులను పలకరించారు. నాలుగైదు ప్రధాన పాత్రల్లో ఆమెది కూడా ఒకటి. బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్ర ఖని ఇలా పలువురు కీలక రోల్స్ చేశారు.

    పంచతంత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. శివాత్మికకు మళ్ళీ నిరాశే ఎదురైంది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో నెక్స్ట్ కనిపించనుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తుండగా… శివాత్మికది కీలక రోల్. విడుదలకు సిద్దమైన రంగమార్తాండ ఏ మేరకు మెప్పిస్తుందో… శివాత్మికకు ఎలాంటి ఇమేజ్ తెస్తుందో చూడాలి.

    ఇక హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. దాన్ని అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా ప్రదర్శించి మేకర్స్ దృష్టి ఆకర్షించాలి. ఇంస్టాగ్రామ్ వేదికగా శివాత్మిక అదే చేస్తున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. తాజాగా బ్యాక్ లెస్ బ్లాక్ ట్రెండీ వేర్ ధరించి శివాత్మిక చెమటలు పట్టించారు. సదరు ఫోటోలు చూశాక శివాత్మిక గ్లామరస్ హీరోయిన్ ఇమేజ్ కోరుకుంటున్నారనిపిస్తుంది.