https://oktelugu.com/

Director Gopichand Malineni-Shruti Haasan : శృతి హాసన్ తో ప్రేమ వ్యవహారం పై నోరు విప్పిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని

Director Gopichand Malineni Shruti Haasan : టాలీవుడ్ యంగ్ దర్శకులలో వరుస సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ మీదున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని..మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘డాన్ శ్రీను’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమైనా గోపీచంద్ ఆ తర్వాత బాడీ గార్డ్ , విన్నర్ , క్రాక్ ,బలుపు , పండగ చేస్కో మరియు వీర సింహా రెడ్డి వంటి సినిమాలు చేసాడు. వీటిల్లో డాన్ […]

Written By: , Updated On : January 19, 2023 / 09:59 PM IST
Follow us on

Director Gopichand Malineni Shruti Haasan : టాలీవుడ్ యంగ్ దర్శకులలో వరుస సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ మీదున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని..మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘డాన్ శ్రీను’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమైనా గోపీచంద్ ఆ తర్వాత బాడీ గార్డ్ , విన్నర్ , క్రాక్ ,బలుపు , పండగ చేస్కో మరియు వీర సింహా రెడ్డి వంటి సినిమాలు చేసాడు.

వీటిల్లో డాన్ శ్రీను , బలుపు , క్రాక్ మరియు వీర సింహా రెడ్డి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి..ఈయన ఫిల్మోగ్రఫీ లో మూడు సినిమాలు శృతి హాసన్ తోనే చేసాడు..ఈ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి..అయితే ఇండస్ట్రీ అన్న తర్వాత రూమర్స్ ఉండడం సర్వసాధారణం..అలా గోపీచంద్ మలినేని మీద కూడా రీసెంట్ గా ఒక రూమర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే ఆయన లేటెస్ట్ చిత్రం వీర సింహా రెడ్డి మూవీ విడుదలకి ముందు జరిగిన ప్రొమోషన్స్ లో శృతి హాసన్ కి అందరి ముందు ‘ఐ లవ్ యూ’ చెప్తాడు..దాంతో ఒక్కరిగా సోషల్ మీడియా మొత్తం వీళ్లిద్దరి మధ్య ఎదో ఉన్నట్టు మీమ్స్ చేసి రచ్చ రచ్చ చేసేసారు..దీనిపై గోపీచంద్ మలినేని స్పష్టత ఇస్తూ ‘శృతి హాసన్ కి నాకు మధ్య ఉన్నది అన్నా చెల్లి అనుబంధం.

నేను ఆ ఉద్దేశ్యం తోనే ఆమెకి ఐ లవ్ యూ చెప్పాను..కానీ సోషల్ మీడియా లో ఉన్న మన గాసిప్ రాయుళ్లు దానిని వేరే ఉద్దేశ్యం తో ఉన్నట్టు మార్చి మీమ్స్ చేసారు..అవి చూసి నేను శృతి హాసన్ బాగా నవ్వుకున్నాము’ అంటూ సమాధానం చెప్పాడు..దీనితో గత కొంతకాలం గా సోషల్ మీడియా లో వస్తున్న ఈ రూమర్ కి చెక్ పడింది.