Nikhil: దేశం కోసం ప్రాణాలు ఇచ్చేంత ధైర్యం ఈ కాలంలో ఎవరికి ఉంటుంది. మన కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికులకు, వారి కుటుంబాలకు మనం ఏం ఇచ్చినా తక్కువే. కానీ ఈ దేశంలో ఉంటూనే మన సైన్యాన్ని కించపరిచేలా కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ నటి అదే పనిచేసింది. దీంతో నెటిజన్లు, సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు కూడా ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ‘బుద్దుందా’ అంటూ తిట్టిపోస్తున్నారు.

తాజాగా నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఓ ట్వీట్ చేశాడు. ‘పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పాకిస్తాన్ కు గట్టి సమాధానం ఇస్తాం’ అని పేర్కొన్నాడు. దీన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. ‘గల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ ఎద్దేవా చేశారు. గల్వాన్ లో చైనా సైనికుల చేతిలో ఓడిపోయి చనిపోయిన భారత సైనికుల పరాక్రమాన్ని అంటూ రిచా అవహేళనగా పరోక్షంగా ఎత్తి చూపింది.
ఈ ట్వీట్ పై సామాన్యులే కాదు.. సినీ సెలబ్రెటీలు కూడా మండిపడ్డారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ ట్వీట్ ను తప్పుపడుతూ మంచు విష్ణు, అక్షయ్ కుమార్ ఖండించారు. తాజాగా కార్తికేయ2తో హిట్ కొట్టిన యంగ్ హీరో నిఖిల్ కూడా ఆ హీరోయిన్ పై ఫైర్ అయ్యారు.

‘మన దేశాన్ని రక్షించడం కోసం 20 మంది భారతీయ సైనికులు ప్రాణత్యాగం చేస్తే వారి గురించి తెలుసుకుంటేనే కన్నీళ్లు వస్తాయి. రాజకీయాల కోసం మన దేశాన్ని అవమానిస్తావా? రిచా దయచేసి గౌరవించు.. దేశం తర్వాతే ఏదైనా అని తెలుసుకో’ అంటూ నిఖిల్ ఘాటు ట్వీట్ చేశఆడు. దీన్ని రీట్వీట్ చేస్తూ చాలా మంది నెటిజన్లు ‘బుద్దుందా’ అంటూ రిచాకు గడ్డి పెడుతున్నారు. భారత పౌరురాలు అయ్యిండి మన దేశ సైన్యాన్ని ఎద్దేవా చేసిన రిచాపై సోషల్ మీడియాలో నిప్పుల వర్షం కురిపిస్తున్నారు.