Mahesh Babu: భారతీయ సాంప్రదాయంలోని కొన్ని పద్ధతులు తప్పక పాటించాలి. ముఖ్యంగా మరణానంతర కార్యక్రమాలు శ్రద్దగా పూర్తి చేయాలి. తల్లిదండ్రులకు కర్మ చేసిన వ్యక్తి తల నీలాలు అర్పిస్తారు. హిందూ సిద్ధాంతం ప్రకారం తల్లికి చిన్న కుమారుడు, తండ్రికి పెద్ద కుమారుడు తలకొరివి పెడతారు. ఒకే కుమారుడైతే ఇద్దరికీ ఆయన చేస్తారు. ఈ ప్రస్తావన వెనుక కారణం… మహేష్ తన తల్లిదండ్రుల కర్మకాండలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అనిపిస్తోంది. కర్మకాండలోని ముఖ్య క్రతువు తలనీలాలు సమర్పించడం చేయలేదు.

సెప్టెంబర్ లో తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. ఆమె కర్మకాండలు మహేష్ పూర్తి చేశారు. ఇక ఈ నెల 15న కృష్ణ మరణించడం జరిగింది. పెద్ద కుమారుడు రమేష్ కన్నుమూసిన నేపథ్యంలో మహేషే తండ్రి చితికి నిప్పంటించారు. అయితే రెండు సందర్భాల్లో మహేష్ తల వెంట్రుకలు తీయలేదు. దీంతో కారణం ఏమిటని జనాలు విశ్లేషించే పనిలో పడ్డారు. దీనికి ప్రధాన కారణం అప్ కమింగ్ చిత్రాలే అని తెలుస్తుంది. మహేష్ జుట్టు తీసేస్తే అది పూర్తి స్థాయిలో పెరగడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. త్రివిక్రమ్ మూవీ ఆల్రెడీ సెట్స్ పై ఉంది.
మరొక ప్రధాన కారణం.. మహేష్ జుట్టు పూర్తి స్థాయిలో ఒరిజినల్ కాదు. ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. చాలా సహజంగా కనిపించే క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీతో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. దీంతో మహేష్ జుట్టు తీయడం సరైన నిర్ణయం కాదు. ఆ ఆయన లుక్ పై విమర్శలు వచ్చే ఆస్కారం కలదు. అందులోనూ మహేష్ ని గ్లామర్ ఐకాన్ గా అందరూ చెప్పుకుంటారు. ఈ కారణాలతో మహేష్ తనకు ఇష్టం లేకున్నా జుట్టు తీయలేకపోయారు.

మరోవైపు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి మహేష్ త్రివిక్రమ్ మూవీ షూట్ లో పాల్గొనే అవకాశం కలదంటున్నారు. అయినవారు పోయిన బాధ నుండి బయటపడాలంటే పనిలో బిజీ కావడమే మంచిదని ఆయన భావిస్తున్నారట. దీంతో త్రివిక్రమ్ షూట్ కి అన్ని ఏర్పాట్లు చేశారు. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ఉంది. చాలా కాలం తర్వాత మహేష్-త్రివిక్రమ్ జతకట్టారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు ఆల్ టైం తెలుగు ప్రేక్షకుల ఫెవరేట్ మూవీగా ఉంది. ఖలేజా కమర్షియల్ గా ఆడకున్నా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది.