
Hyper Aadi- Dhanush: జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న హైపర్ ఆది ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ కమెడియన్స్ లో ఒకరిగా మారిపోయాడు.ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో మంచి ఉద్యోగం ని వదిలేసి ఇండస్ట్రీ కి వచ్చిన హైపర్ ఆదికి టాలెంట్ తో పాటుగా అదృష్టం కూడా బాగా కలిసి రావడం తో ఈరోజు ఇండస్ట్రీ లో ఈ స్థానం లో కొనసాగుతున్నాడు.అద్భుతమైన కామెడీ టైమింగ్ తో పాటుగా స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ లో కూడా తన టాలెంట్ ని చూపించాడు హైపర్ ఆది.
అంతకు ముందు సినిమాల్లో కేవలం చిన్న చిన్న పాత్రలు మాత్రమే దక్కాయి, కానీ ఇప్పుడు ఆయన కామెడీ టైమింగ్ ని గుర్తించి దర్శక నిర్మాతలు మెయిన్ కమెడియన్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు.మొన్నీమధ్యనే రవితేజ ‘ధమాకా’ చిత్రం లో కమెడియన్ గా చేసిన హైపర్ ఆది, రీసెంట్ గా ధనుష్ ‘సార్’ మూవీ లో కూడా కమెడియన్ రోల్ చేసాడు.

అంతే కాదు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమా ‘హరి హర వీరమల్లు’ లో కూడా హైపర్ ఆది కీలక పాత్ర పోషించాడు.ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన సార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హీరో ధనుష్ హైపర్ ఆది గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఆయన మాట్లాడుతూ ‘హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాలి.ఈయనకి క్రేజ్ మామూలుగా లేదండి.మొన్న కూడా ఎదో ఫంక్షన్ లో మేమందరం మాట్లాడుతున్నప్పుడు రాని రెస్పాన్స్, హైపర్ ఆది పేరు తియ్యగానే ఒక రేంజ్ లో వచ్చింది.ఇతనికి ఇక్కడ ఇంత క్రేజ్ ఎలా వచ్చింది’ అని త్రివిక్రమ్ ని అడగగా, అప్పుడు త్రివిక్రమ్ దానికి సమాధానం చెప్తూ ‘ఇతను జబర్దస్త్ అనే పాపులర్ షో ద్వారా క్రేజ్ దక్కించుకున్నాడు..ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టాడు’ అని చెప్తాడు, అప్పుడు ధనుష్ ‘ఖాళీ సమయం దొరికినప్పుడు నేను కూడా మీ స్కిట్స్ చూస్తా, అవి చూసిన తర్వాత నీ ఫ్యాన్స్ లాగానే నేను కూడా విజిల్స్ వేస్తాను’ అంటూ హైపర్ ఆదికి చెప్తాడు ధనుష్.