
Ex-Telangana CS Somesh Kumar: అధికారాంతమున చూడాలి అయ్యవారు చిత్రాలు అన్నట్టుగా మారిపోయింది తెలంగాణ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పరిస్థితి.. దేశానికి గుణాత్మక మార్పు చూపిస్తానని, దేశంలో చక్రాలు తిప్పుతానని, మోదీని గద్దె దించుతా అని శపథాలు చేసిన కెసిఆర్ ఏలుబడిలో ఈ బీహారీయుడు ఏళ్ల తరబడి డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో ముఖ్య కార్యదర్శిగా కొనసాగాడు. 317 జీవో, ధరణి వంటి వివాదాస్పద నిర్ణయాలు కూడా ఈ సార్ హయాంలోనే పురుడు పోసుకున్నాయి. రోజులన్నీ ఒకే విధంగా ఉండవు కదా.. హైకోర్టు తలమీద ఒక్కటి వేసే వరకు…సార్ కు జ్ఞానోదయం అయింది. పెద్ద సార్ కు తల బొప్పి కట్టింది. ఇంకేముంది పీచేముడ్ లాగా ఏపీకి వెళ్ళాడు.
ఏపీకి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్నది కేసీఆర్ కాదు కదా…జగన్ పెద్దగా లెక్కపెట్టలేదు.. లెక్క చేయలేదు.. బీహారీయులకు రెడ్ కార్పెట్ పరిచేందుకు ఆయన ఏమన్నా కేసీఆర్ కాదు కదా.. జగన్ ఇటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు.. జీఏడీ లో రిపోర్టు చేసిన ఆయనను ఖాళీగానే ఉంచాడు. దీంతో ఆయన అప్పట్లోనే స్వచ్ఛంద పదవి విరమణ చేస్తారని ఊహాగానాలు వెలుపడ్డాయి. అప్పుడు ఆయన దానిని ఖండించారు.. తర్వాత తత్వం బోధపడింది..సీఎస్ గా పనిచేసిన నేను ఇలా ఉండడమేంటని అనుకున్నాడో ఏమో పచ్చంద పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సీఎం జగన్ ఆమోదముద్ర కూడా వేశాడు.

వాస్తవానికి సోమేశ్ కుమార్ ఈ ఏడాది డిసెంబర్ వరకు సర్వీస్ లో కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో మరో పోస్ట్ లో కొనసాగేందుకు ముందుగానే ఆయన విఆర్ఎస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 1989 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్ కుమార్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కేడర్ కు ఆయన వెళ్లాల్సి ఉంది.. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు తెలంగాణలో కొనసాగారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. అయితే క్యాట్ ఉత్తర్వులను డిఓపిటి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయడంతో.. తెలంగాణ హైకోర్టు ఆయనను తక్షణం ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే సోమేశ్ కుమార్ ను తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించే అవకాశం కనిపిస్తోంది.. ఇప్పటికే ఆయనకు కేసీఆర్ ఆమె ఇచ్చినట్టు కూడా సమాచారం. అంటే త్వరలో తెలంగాణ ప్రభుత్వానికి మరో సలహాదారు వస్తున్నాడన్నమాట.. ఇప్పటికే పని పాట లేక చాలామంది సలహాదారులు ఉంటే… కొత్తగా ఈ సలహాదారు ఏం చేస్తాడో కెసిఆర్ కే తెలియాలి. బహుశా దీన్నే గుణాత్మక మార్పు అంటారేమో.