
Hero Vikram Life Story: సినిమా తెరపై నటనతో అలరించే వారిని చూసి ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారు. వారికొచ్చే పారితోషికం చూసి షాక్ అవుతారు. రియల్ గా వారు ఎక్కడికెళ్లినా వచ్చే అభిమానులను చూసి వాళ్లలా ఫేమస్ కావాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. కానీ వారికి ఆ పాపులారిటీ ఊరికే రాదు. దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతీ నటుడి రియల్ లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంటుందని అస్సలు అనుకోవడానికి లేదు. తెరపై నటనతో అలరిస్తున్నా వాటి వెనుక ఎన్నో విషాధ గాథలు ఉంటాయి. తెలుగు, తమిళం సినిమాల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఓస్టార్ హీరో జీవితం కూడా ఎన్నో కష్టాల మయంతో కూడుకొని ముందుకెళ్లింది. వాటన్నింటిని తట్టుకొని నిలబడ్డ అతనికి చివరికి స్టార్ ఇమేజ్ దక్కింది. 20 ఏళ్లుగా సినిమా హీరోగానే కొనసాగుతున్న ఆ స్టార్ హీరో ఎవరోతెలుసా?
విభిన చిత్రాలు తీయడమంటే ఆయనకిష్టం.. ప్రయోగాల సినిమాలతో అలరించడం ఆయన అలవాటు.. అనుకున్న విధంగానే వినూత్న కథలు ఆయన వద్దకు చేరుతాయి. పాత్ర ఎలాంటిదైనా అందులో లీనమైపోయే ఆ నటుడే విక్రమ్. ‘చియాన్’ విక్రమ్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈయన మొదట్లో కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు. కానీ ఇక్కడ గుర్తింపు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లారు. అక్కడా కొన్ని రోజుల పాటు సైడ్ క్యారెక్టర్ గా నటించారు. ఆ తరువాత ‘చియాన్’ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఈ హీరోకు గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ తన స్టార్ డంను కొనసాగిస్తున్నారు.
విక్రమ్ కు స్టార్ డం ఊరికే రాలేదు. ఇది రావడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. విక్రమ్ 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే సినిమాల్లో నటించాలన్న కోరిక పుట్టింది. దీంతో ఆయన మూగ అబ్బాయిగా ఓచిత్రంలో నటించారు. ఈయన నటనకు మద్రాసులో ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఈ అవార్డు అందుకొని స్నేహితుడితో కలిసి బైక్ పై వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో విక్రమ్ కాలు తీసేయాలని వైద్యులు చెప్పారు. కానీ అతని తల్లి ఒప్పుకోలేదు. అయితే 4 సంవత్సరాల పాటు బెడ్ పైనే ఉండాల్సి వచ్చింది. కుడికాలు పూర్తిగా గాయపడి చీల మండలం వరకు ఇన్ఫెక్షన్ జరిగింది.

అలా కొన్నాళ్ల పాటు కష్టాల జీవితాన్ని సాగించిన ఆయన 1990లో ఎన్ కాదల్ కన్మణి అనే చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పలు తెలుగు సినిమాల్లో కనిపించారు. అలా పదేళ్ల పాటు విక్రమ్ కు గుర్తింపు రాలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్న కల నెరవేరలేదు. అయినా నిరాశపడకుండా విక్రమ్ ముందుకెళ్లాడు. చివరి ప్రయత్నంగా ఆయన ‘సేతు’ సినిమాలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పాటు విక్రమ్ కు స్టార్ ఇమేజ్ వచ్చింది. దీనినే తెలుగులు ‘శేషు’ అని రీమేక్ తీశారు. ఇక్కడా డాక్టర్ రాజశేఖర్ కెరీర్ మలుపు తిరిగింది.
అప్పటి నుంచి విక్రమ్ వెనుదిరిగి చూడలేదు. ఆ తరువాత వచ్చిన ‘చియాన్’(తెలుగులో అపరిచితుడు) సినిమాలో విక్రమ్ నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా తరువాత విక్రమ్ ప్రయోగాల చిత్రాలు ఎక్కువగా తీయడం విశేషం. శంకర్ డైరెక్షన్లో ‘ఐ’ సినిమా కోసం ఆయన చేసిన ఎక్సరసైజ్ తో విక్రమ్ తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. అయినా ఆయన తన మనోధైర్యంతో కోలుకున్నాడు. దాదాపు 20 ఏళ్లు గడిచినా విక్రమ్ స్టార్ ఇమేజ్ తగ్గలేదు. ఇప్పిటికీ ఆయన హీరోగానే కొనసాగుతున్నారు. ఆయన నటించిన పొన్నియన్ సెల్వన్ 2 త్వరలో రిలీజ్ కాబోతుంది.