
Catherine Tresa: చేతిలో అవకాశాలు ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. అవే లేకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రెడ్ కార్పెట్ పరిచిన పలు సంస్థలు ముఖం చాటేస్తాయి. క్లిక్ మనిపించే కెమెరాలు దూరంగా వెళ్లిపోతాయి. ఇంటర్వ్యూల కోసం ఎగబడిన మీడియా సంస్థలు పట్టించుకోవడం మానేస్తాయి. అందుకే సినిమా పరిశ్రమలో ఫెడ్ అవుట్ ఉండేందుకు నటీమణులు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంటారు.. కానీ చక్కబెట్టుకునే క్రమంలో చాలామంది చేతులు కాల్చుకున్నారు.. అందులో నటి కేథరిన్ ట్రేసా ఒకరు. ఇద్దరమ్మాయిలు అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ తో జత కట్టి సందడి చేసింది.. తర్వాత అదే హీరోతో సరైనోడు అనే సినిమాలో నటించింది. ఇందులో ఎమ్మెల్యే పాత్రలో అలరించింది.. తర్వాత రానా దగ్గుబాటి హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది.
అదేంటో గాని ఆ తర్వాత కేథరీన్ కు సరైన పాత్రలు పడలేదు. దీంతో ఆమె అవకాశాల కోసం ఇతర పరిశ్రమల్లోకి వెళ్ళింది. అక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ కావడంతో వెనక్కి వచ్చేసింది. ఇక వేరే దారి లేక సోషల్ మీడియాను నమ్ముకుంది. రెచ్చిపోయే భంగిమల్లో ఫోటోలు షేర్ చేస్తోంది..దీంతో ఈ అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యద అందాలు కనిపించేలా, థండర్ థైస్ తో చూపు తిప్పుకొనివ్వడం లేదు.

ఆ మధ్య వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజకు జోడిగా నటించింది.. సినిమాలో కీలకపాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది… సోషల్ మీడియాలో యమా యాక్టిివ్ గా ఉండే కేథరిన్ అభిమానులు అడిగే ప్రశ్నలకు చిలిపిగా సమాధానం ఇస్తుంది..ఇక ప్రస్తుతం కేథరిన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. ” బయట సూర్యుడు హాట్, సోషల్ మీడియాలో నువ్వు హాట్… ఇంత వేడిని ఎలా తట్టుకోవడం” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..