Diabetes Control: మధుమేహం ప్రపంచ వ్యాప్తంగా కలవరపెడుతోంది. షుగర్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 శాతం మంది మధుమేహులు ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. డయాబెటిక్ పేషెంట్లు రోజురోజుకు పెరుగుతున్నారు. మారుతున్న జీవన శైలి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల షుగర్ వ్యాధి ఎక్కువ మందికి అంటుకుంటోంది. ఫ్రాంక్రియాస్ గ్రంథి, ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోవడం వల్ల షుగర్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ తో ఎన్నో రకాల నష్టాలు కలుగుతాయి.

శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోతే రక్తంలో చక్కెర ఎక్కువవుతుంది. ఫలితంగా మధుమేహం వస్తుంది. దీనిపై ఎన్నో అపోహలున్నాయి. మధుమేహులు చక్కెరను తీసుకోకూడదు. ప్రాసెస్ ఆహారాలకు దూరంగా ఉండాలి. పిండి పదార్థాలు మితంగా తీసుకోవాలి. షుగర్ పేషెంట్లు సరైన ఆహారాలు తీసుకుంటేనే ఆరోగ్యం సహకరిస్తుంది. లేదంటే చక్కర పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వారు ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి. అధిక బరువు, ఊబకాయం సమస్య ఉన్నవారికి మధుమేహం త్వరగా వచ్చే వీలుంటుంది.
అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడేవారికి షుగర్ వేగంగా వస్తుందని అంటుంటారు. ఊబకాయంతో ఉన్న వారికి షుగర్ ఉంటుందనేది అపోహే. బరువు లేని వారికి కూడా డయాబెటిస్ రావచ్చు. షుగర్ ఫ్రీ స్వీట్లు అని ప్రచారం నిర్వహించి మధుమేహులు తినొచ్చని చెబుతున్నారు. ఇది అపోహే. చక్కెరకు మందులు వేసుకోకుంటే దృష్టి లోపం సమస్యకు దారి తీస్తుంది. రక్తపోటు, గ్లూకోజ్ బరువును నిరోధిస్తాయి. ధూమపానం మానేస్తే అంధత్వ సమస్య ఏర్పడుతుంది. సంవత్సరానికోసారి ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం మంచిది.

మధుమేహం ఉన్న వారు ఇష్టారీతిగా ఆహారాలు తీసుకోకూడదు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలనే తీసుకోవాలి. షుగర్ నియంత్రణలో ఉంచుకోకుంటే మన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. డయాబెటిక్ ఒకసారి వచ్చిందంటే జీవితాంతం పోదనేది అపోహే. మధుమేహాన్ని పూర్తిగా దూరం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్ పేషెంట్లు ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. జీవితంలో డయాబెటిస్ ను తగ్గించుకునేందుకు నిరంతరం మంచి ఆహారాలు తీసుకుని నియంత్రణలో ఉంచుకుంటే సరి.