https://oktelugu.com/

Microsoft layoff : కొలువు కోసం 1000 రెజ్యూమ్ లు పంపించాడు.. ఒక్క కంపెనీ కనికరించలేదు

ఉద్యోగులను అడ్డగోలుగా తొలగిస్తున్నాయి. అయినప్పటికీ చాలామంది యువత ఉద్యోగం సాధించాలని సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. వీరికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో మరి?!

Written By:
  • Rocky
  • , Updated On : June 18, 2023 / 03:09 PM IST
    Follow us on

    Microsoft layoff : 5 అంకెల జీతం. వారంలో రెండు రోజులు సెలవు. కోరినన్ని క్రెడిట్ కార్డులు ఇచ్చే బ్యాంకులు.. రుణం ఇస్తామని వెంటపడే వివిధ సంస్థలు.. ఐటి ఉద్యోగం అంటే నిన్న మొన్నటి వరకు ఇవే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియదు. జీతం పెంచుతారో పెంచుతారో తెలియదు.. వారంలో ఎన్ని రోజులు పని చేయమంటారు చెప్పరు.. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మొత్తానికి ఐటీ ఉద్యోగం అంటే గోటి చుట్టూ రోకటి పోటు సామెతను గుర్తుకు తెస్తోంది. దీనికి తోడు ఆర్థిక మాంద్యం భయాలతో చాలా సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. ఆ ఉద్యోగులు అనుభవిస్తున్న కష్టాలు అన్ని ఇన్ని కావు.
    పదివేల మంది అవుట్
    సాంకేతిక ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ అంటే తెలియని వారు ఉండరు. ఆ కంపెనీ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకూ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించినట్లు దాఖలాలు లేవు. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి 18న తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో పదివేల మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అలా తొలగిస్తున్న వారికి సమాచారం కూడా అందించింది. ఆ జాబితాలో అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన నికోలస్ నోల్టన్ ఒకరు. సంస్థ లే _ఆప్స్ తో మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేస్తూనే మరో కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించారు..కానీ, ఆ ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఈ ఏకంగా 1000 సార్లు ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలం కావడంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
    నా ఉద్యోగం పోయింది
    ” నా పేరు నికోలస్ నోల్టన్.. అమెరికా లోని నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన వాడను. 2022 వరకు నా ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి భయం ఉండేది కాదు. వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసేవాడిని. చేతినిండా డబ్బు ఉండేది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు గానీ ఆర్థిక మాంద్యం నన్ను తీవ్రంగా దెబ్బ కొట్టింది. నాలో పని నైపుణ్యాలు తక్కువ ఉన్నాయని యాజమాన్యం ఉద్యోగం నుంచి తీసివేసింది. ఈ రోజే నా లాస్ట్ వర్కింగ్ డే. గత రెండు నెలలుగా కొత్త ఉద్యోగం కోసం అన్ని ప్రయత్నాలు చేశాను. ఇప్పటికే వెయ్యి పైగా రెస్యూమ్ లు పంపించాను. అందులో 250 కి పైగా అప్లికేషన్లు సెలెక్ట్, 57 రిక్రూటర్స్ కాల్స్, 15 హెరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూలు, మూడు ఫైనల్ రౌండ్స్ ఇన్ని పూర్తి చేశాను. విచిత్రం ఏమిటంటే ఆయా సంస్థలు నాకు ఉద్యోగం ఇచ్చేందుకు వెనుకంజ వేశాయి” అంటూ  వాపోయాడు.. ప్రఖ్యాత ఐటీ సంస్థలు లే ఆప్స్ ఉద్యోగులను వీధుల్లోకి తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నాయని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం నికోలస్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక చాలావరకు ఐటీ సంస్థలు ఆర్థిక మాంద్యం వల్ల ఖర్చులను తగ్గిస్తున్నాయి. ఉద్యోగులను అడ్డగోలుగా తొలగిస్తున్నాయి. అయినప్పటికీ చాలామంది యువత ఉద్యోగం సాధించాలని సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. వీరికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో మరి?!