
Abdullapurmet Love Affair: ప్రేమ ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ప్రాణాన్ని బలి కోరింది.. మిత్రుడిని చంపమని ప్రేరేపించింది.. చివరకు అదే జరిగింది. ప్రేయసి కోసం ఓ యువకుడు కిరాతకుడిలా మారాడు. స్నేహితుడిని అంతం చేశాడు. అతడి గుండెను ఫోటో తీసి ప్రేయసికి పంపాడు. ఈ ఘటన నల్లగొండ ఎంజీ యూనివర్సిటీలో జరిగింది.
ప్రేమ.. స్నేహం.. గొడవ..
ప్రేమ వ్యవహారంలో తలెత్తిన గొడవ స్నేహితుడు, తోటి విద్యార్థినే అత్యంత కిరాకతకంగా హతమార్చాడు. ఎంజీ యూనివర్సిటీలో నవీన్, హరి ఇంజనీరింగ్ ఈఈఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇద్దరూ మంచి మిత్రులు.. అనుకోకుండా ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. దీంతో వారిమధ్య వివాదం తలెత్తింది. ఈ విషయంపై పలుమార్లు గొడవపడ్డారు.
పార్టీ చేసుకుందామని.
ఈక్రమంలోనే ఈనెల 17న పార్టీ చేసుకుందామని అబ్దుల్లాపుర్‌మెట్‌లోని తన ఫ్రెండ్ రూమ్‌కి హరిని పిలిచాడు నవీన్. అక్కడే ఇద్దరూ మద్యం తాగారు. అనంతరం మరోసారి లవర్ విషయమై ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. మాటా మాటా పెరిగి ఆవేశంలో నవీన్‌ను దారుణంగా హత్య చేశాడు హరి. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
కుమారుడు ఆచూకీ తెలియక..
నవీన్ ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మిత్రులను ఆరా తీశారు.. ఫలితం లేకపవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారిస్తుండగా.. అబ్దుల్లాపుర్‌మెట్ పోలీసుల ఎదుట హరి లొంగిపోయాడు. నవీన్ ను చంపానని అంగీకరించాడు. దీంతో పోలీసులు ఈ హత్యకు సంబంధించి అతడిని విచారిస్తున్నారు.
వెలుగులోకి విస్తుపోయే విషయాలు..
హరిహర కృష్ణ ఒక సైకో అని తెలుస్తోంది. నవీన్‌ను అతడు అత్యంత కిరాతకంగా హత్య చేశాక ఆ విషయాన్ని అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు. నవీన్‌ను చంపినట్లు వాట్సాప్‌లో మెసేజ్ కూడా పెట్టాడు. ఆ మెసేజ్ చాలా దారుణంగా ఉంది. ‘ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు అంటూ నవీన్ వేలును కోసి ఆ ఫొటో అమ్మాయికి పంపాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది.. అంటూ పెదాలు కోసి ఆ ఫొటోనూ పంపాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది.. అంటూ నవీన్ గుండెను కోసి ఆ ఫొటోను కూడా సెండ్ చేశాడు. చివరకు నవీన్ తలను కోసి దూరంగా పడేసినట్లు సమాచారం.

యువతి పాత్ర పై విచారణ..
వాట్సాప్ లో వచ్చిన ఫోటోలు చూసి మెసేజ్ లు చదివిన యువతి హరి జోక్ చేస్తున్నాడు అనుకుందో.. లేక మరేమనుకుందో.. అవునా.. ఓకే, వెరీ గుడ్ బాయ్… అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఆ అమ్మాయి పాత్రపై కూడా విచారణ జరపనున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ తెలిపారు.