Francisco Rivera: తిప్పలన్నీ జానెడు పొట్ట కోసమే.. ఇది ఒకప్పటి నానుడి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామన్నది కాదు.. ఎంత సంపాదిస్తున్నామన్నదే ముఖ్యంగా మారింది. ఎలా సంపాదిస్తున్నావన్నది ఎవరూ పట్టించుకోరు. ఇక నేటి తరం కూడా సంపాదనపైనే ఎక్కువ దృష్టిపెట్టింది. బంధాలు, అనుబంధాలు, లైఫ్ రిస్క్ అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సంపాదనే లక్ష్యంగా కష్టపడుతోంది. అయితే చాలా మంది గంటల కొద్ది పనిచేసినా సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి వారి కష్టం చూస్తే బాధగా ఉంటుంది. రోజంతా కష్టపడినా వారి ఆదాయం కనీసం రోజు గడవడానికి కూడా చాలదు. కానీ, ఇక్కడో వ్యక్తి రోజుకు కేవలం 20 నిమిషాలే పనిచేస్తాడు. సంపాదన మాత్రం కోట్లల్లో ఉంది. ఏడాదికి ఏకంగా రూ.3.8 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎవరితను.. అతని సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.
ఆర్గానిక్ క్యాండిల్స్ తయారీ..
ఓర్లాండ్‌కు చెందిన ప్రాన్సిస్కో రివెరా 2023, ఫిబ్రవరి వరకు ఆన్‌లైన్ ట్యూటర్‌గా పనిచేస్తూ ఉపాధి పొందాడు. మరోవైపు పాఠశాలలో చీచర్‌గా పనిచేసేవాడు. ఎంత కష్టపడినా వస్తున్న ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో సంతృప్తి చెందలేదు. దీంతో ప్రత్యామ్నాయం ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇలా యూట్యూబ్‌లో బిజినెస్‌కు సంబంధించిన ప్రింట్ ఆన్ డిమాండ్(పీవోడీ) సైడ్ హాస్లర్ వీడియోలతో ప్రేరణ పొందాడు. ఈ క్రమంలో అతనికి ఆర్గానిక్ క్యాండిల్స్ తయారీ ఆలోచన వచ్చింది. తయారు చేయడంతోపాటు విక్రయించాలనుకున్నాడు. ఇందుకోసం ముందుగా తయారు చేయడం నేర్చుకున్నాడు. తర్వాత ఆన్‌లైన్‌లో ఎలా విక్రయించాలి, ప్రొడక్టులను ఎలా డిజైన్ చేయాలి అనే అంశాల్లో పరిజ్ఞానం పొందాడు. పట్టు సాధించాక ఆన్‌లైన్‌లో బిజినెస్ విస్తరించేలా చేశాడు. ఏడాది తిరిగేలోగా సంపాదన రూ.3.8 కోట్లకు చేరుకుంది. ప్రతీ అమ్మకంలో దాదాపు 30% నుంచి 50% లాభం అందుకుంటున్నాడు రివెరా. ఇప్పుడు తాను మార్కెటింగ్‌కి, ప్రింట్‌ఫై కోసమే డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాడు.
రోజుకు 20 నిమిషాలే..
ప్రొడక్ట్ లాంఛింగ్ వరకు అలుపెరగకుండా కష్టపడిన రివెరా.. ఇప్పుడు రోజుకు కేవలం 20 నిమిషాలే పనిచేస్తున్నాడు. ఒక్కోరోజు రెండు నుంచి మూడు గంటలు పనిచేస్తాడు.లేబుల్ డిజైన్ కోసం కాస్త ఎక్కువ సమయం పడుతుందని తెలిపాడు. ఇక మిగతా సమయంలో సంగీతం వింటూ గడిపేస్తున్నాడు. తాను ఇప్పుడు గతంలోకన్నా తక్కువ పనిచేసి ఎక్కువ సంపాదిస్తున్నానని వెల్లడించాడు రివెరా.
పీవోడీ ఎంతో ఉపయోగం..
మీరు చేస్తున్న 9 టూ 5 జాబ్‌లో ఆదాయం అంతంత మాత్రమే ఉంటే.. మంచి ఆదాయమార్గంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాడు రివెరా. ఇందుకు పీవోడీ(ప్రింట్ ఆన్ డిమాండ్) యూట్యూబ్ చానెల్ వీడియోలు ఎంతో ఉపయోగపడతాయని సూచిస్తున్నాడు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవాళ్లకు ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎలా ప్రారంభించాలి, ట్రైనింగ్, పెట్టుబడి, ఆదాయం, లాభాలు తదితర అంశాలపై ట్రైనింగ్ వివరాలు ఉంటాయని తెలిపాడు. వ్యాపారానికి సంబంధించిన గైడెన్స్‌తోపాటు మార్కెటింగ్ సహకారం కూడా అందిస్తుందని పేర్కొన్నాడు.