
Renu Desai- Pawan Kalyan: రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె ఓ ఎమోషనల్ సందేశం పోస్ట్ చేయగా అది ఎవరిని ఉద్దేశించి అనే చర్చ మొదలైంది. రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. డైవర్స్ అనంతరం రేణు దేశాయ్ పూణేకి వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ తన కెరీర్లో బిజీ అయ్యారు. బద్రి మూవీ తర్వాత మరలా ఆమె సినిమాలు చేయలేదు. ఓ తమిళ చిత్రం చేసినట్లు సమాచారం.
ఇటీవల ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నటిగా బిజీ అవుతున్నారు. ఆద్య టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై మరో అప్డేట్ రాలేదు. టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ నటిస్తున్నారు. అధికారికంగా ఆమెకు ఇది కమ్ బ్యాక్ చిత్రం. రవితేజ హీరోగా నటిస్తున్నారు. దసరా కానుకగా విడుదల కానుంది. టైగర్ నాగేశ్వరరావు మూవీ నుండి రేణు దేశాయ్ లుక్ కూడా రివీల్ చేయగా వైరల్ అయ్యింది. తెల్ల బట్టల్లో రెండు ఇంటెన్స్ లుక్ ఆసక్తి రేపింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. ‘వేసవిలో చల్లని గాలిలా కొందరు సడన్ గా మన జీవితాల్లోకి వస్తారు. తమ కళ్ళతో మ్యాజిక్ చేస్తారు. మనసుతో మాట్లాడతారు. వారితో గడిపిన కొన్ని గంటలు కూడా గుండెల్లో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి వారు వదిలి వెళితే బాధను తట్టుకోలేము. కొన్ని బంధాలు మాత్రం పోతూపోతూ కూడా ఆనందం మిగిల్చిపోతాయి… అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే అని కొందరు భావిస్తున్నారు. ఆయనతో అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. పవన్-రేణు విడిపోయినప్పటికి హెల్తీ రిలేషన్స్ కలిగి ఉన్నారు. పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఇటీవల అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం కి సంబంధించిన కార్యక్రమంలో రేణు-పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
View this post on Instagram