
NTR30 New Look : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. వస్తున్నా అంటూ ఓ వీడియో గ్లిమ్స్ విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్ లో పిచ్చ జోష్ నింపించింది. ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్ మొదలైందంటూ ఆర్ ఆర్ ఆర్ స్టార్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు కొరటాల శివ… ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో యాక్షన్ సన్నివేశాలతో షూటింగ్ మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా షూటింగ్ సెట్స్ లో జాయిన్ అవుతున్నట్లు తెలియజేస్తూ ఎన్టీఆర్ వీడియో విడుదల చేశారు. అందులో అస్పష్టంగా ఆయన లుక్ రివీల్ అయ్యింది. బ్యాక్ నుండి ఎన్టీఆర్ ని కవర్ చేశారు. దీంతో టోటల్ లుక్ రివీల్ కాలేదు. ‘వస్తున్నా’ అంటూ క్యాప్షన్ పెట్టి విడుదల చేసిన ఆ వీడియో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.

ఎన్టీఆర్ 30 విడుదలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. 2024 ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఇంత భారీ చిత్రం సంవత్సరంలో పూర్తి అవుతుందా లేదా? అనే సందేహాలు ఉన్నాయి. అనుకోని కారణాలతో ఎన్టీఆర్ 30 షూటింగ్ ఆలస్యమైంది. తారకరత్న మరణం కారణంగా మార్చిలో మొదలవ్వాల్సిన షూటింగ్ ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యింది. అయితే పక్కా ప్రణాళికతో ఉన్న కొరటాల శివ త్వరిత గతిన పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట.
ఇక ఎన్టీఆర్ 30 కథపై దర్శకుడు కొరటాల ఆల్రెడీ ఓ స్పష్టత ఇచ్చారు. ఇది సముద్ర తీర నేపథ్యంలో సాగుతుంది. మృగాల్లాంటి విలన్స్ ని భయపెట్టేదిగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందన్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడం మరో విశేషం. ఈ శ్రీదేవి వారసురాల్ని సౌత్ ఇండియాకు తేవాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఎన్టీఆర్ 30తో సాకారం అయ్యాయి. ఆమె పాత్ర కథలో కీలకం. చాలా ఎమోషనల్ అని కొరటాల శివ చెప్పారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Great to be on sets again with Koratala Siva ! pic.twitter.com/uKNFNtKyZO
— Jr NTR (@tarak9999) April 1, 2023