
Manchu Manoj Vs Manchu Vishnu : మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మా మధ్య గొడవల్లేవని విష్ణు నిరూపించే ప్రయత్నం చేస్తుండగా, వివాదాలు నిజమే అని మనోజ్ అంటున్నారు. కొన్ని నెలలుగా విష్ణు-మనోజ్ మధ్య దూరం పెరిగిందని, గొడవలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విష్ణు మీద ఆరోపణలు చేస్తూ, అతడు గొడవపడుతున్న వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో వివాదాలు నిజమే అని ఒక స్పష్టత వచ్చింది.
అయితే ఇదంతా ఫ్రాంక్ అంటున్నాడు మంచు విష్ణు. త్వరలో మేము ఓ భారీ రియాలిటీ షో స్టార్ట్ చేయబోతున్నాము. దాని ప్రమోషన్లో భాగంగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నట్లు అపోహ కలిగించామని పరోక్షంగా చెప్పాడు. ‘హౌస్ ఆఫ్ మంచూస్’ టైటిల్ తో ప్రోమో కూడా విడుదల చేశారు. దీనిపై మంచు లక్ష్మి, మనోజ్ లను స్పష్టత కోరగా మరో వెర్షన్ వినిపిస్తుంది. మంచు లక్ష్మి అసలు ఆ రియాలిటీ షో గురించి మాకు తెలియదు. మాకు సంబంధం లేదన్నారట.
అదే సమయంలో మంచు మనోజ్ టీమ్ గొడవ జరిగిన మాట నిజమని స్పష్టత ఇచ్చారట. ఆ రోజు సారథి ఇంటికి వెళ్లి విష్ణు గొడవ చేశాడు. ఆ విషయాన్ని సారథి భార్య ఫోన్ చేసి మనోజ్ కి చెప్పింది. దాంతో మనోజ్ సారథి ఇంటికి వెళ్లాడని ఆయన టీమ్ వెల్లడించారట. మనోజ్, లక్ష్మి మాటలు గమనిస్తుంటే… డ్యామేజ్ కంట్రోల్ కోసం విష్ణు నిజంగా జరిగిన గొడవను రియాలిటీ షో అని చెబుతున్నాడనిపిస్తుంది. విష్ణుతో అక్క మంచు లక్ష్మికి, మనోజ్ కి చెందినదని స్పష్టత వచ్చింది.
ఇటీవల మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన కూడా గొడవ జరిగిన మాట వాస్తవమే అని పరోక్షంగా చెప్పారు. అన్నదమ్ముల గొడవలతో నాశనమే తప్ప ఏమీ ఉండదు. వివాదాలు సంతోషం దూరం చేస్తాయి. కొన్ని విషయాలు ఎందుకు జరిగాయా అని బాధేస్తుంది. అలా జరగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొన్ని గొడవలు ఎందుకు జరుగుతాయో చెప్పలేం అన్నారు. ఇక్కడ విష్ణు-మనోజ్ పేర్లు ప్రస్తావించకుండానే మోహన్ బాబు విభేదాల మీద స్పష్టత ఇచ్చారు. కాబట్టి హౌస్ ఆమ్ మంచూస్ అని విష్ణు ప్రకటించిన రియాలిటీ షో ఒక భూటకం…