Train: దూర ప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కువగా రైలు ప్రయాణాలను ఇష్టపడతారు. ఇక నగరాల్లో ఉండేవారు దూరం తక్కువైనా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లోక్ ట్రైన్లు, మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే చాలా మంది రైళ్లకు సంబంధించిన అనేక విషయాలను గమనించరు. తమకు అవసరం ఉన్న సమచారం మాత్రమే తెలుసుకుంటారు. మిగతావి వదిలేస్తారు. అలా వదిలేసే వాటిలో ఇదీ ఒకటి. ఇంతకీ అందేంటి. దానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి.. మనం తెలుసుకోవాల్సి అవసరం ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం.
రైలు బోగీ నంబర్..
రైలు బోగీలపై కచ్చితంగా నంబర్ ఉంటుంది. ప్రతీ బోగీపై ఐదు అంకెలతో ఈ నంబర్ ముద్రిస్తారు. కానీ దీనిని ఎందుకు ముద్రిస్తారో చాలా మందికి తెలియదు. రైలు బోగీ నంబర్ అనుకుంటారు. అయితే బోగీ నంబర్ కొంత మేరకు కరెక్టే. కానీ, అందులో మొదటి రెండు నంబర్లు ఒక ఇండియేషన్, మిగతా మూడు నంబర్లు బోగీ నంబర్‌ను సూచిస్తాయి.
తయారు చేసిన ఇయర్..
రైలు బోగీలపై ఉన్న ఐదు అంకెల సంఖ్యలో మొదటి రెండు నంబర్లు ఆ బోగీని తయారుచేసిన ఇయర్‌ను సూచిస్తాయి. ఉదాహరణకు 00296 నంబర్ ఉందనుకుంటే.. 00 నంబర్ ఆ బోగీని 2000 సంవత్సరంలో తయారు చేసినట్లు తెలియజేస్తుంది.
చివరి మూడు నంబర్లు..
ఇక ఐదు అంకెట నంబర్‌లో చివరి మూడు నంబర్లు బోగీలను ఇండికేట్ చేస్తాయి. ఆ నంబర్ ఉన్న బోగీ ఎలాంటిదో తెలియజేస్తాయి.
1 నుంచి 200
ఐదు అంకెల నంబర్‌లో చివరన 001 నుంచి 200 వరకు ఉంటే.. ఆ నంబర్ ఉన్న బోగీలన్నీ ఏసీ బోగీలని అర్థం. ఈ బోగీల్లో స్లీపర్ బెడ్స్ విత్ ఏసీ ఉంటాయి. వీటిని రిజర్వు చేసుకోవాలి.
201 నుంచి 400
ఇక ఐదు అంకెల నంబర్‌లో చివర 2001 నుంచి 400 వరకు ఉంటే.. ఆ బోగీలన్నీ స్లీపర్ క్లాస్ బోగీలన్నమాట. అందులో స్లీపర్ బెడ్స్ ఉంటాయి. వీటిని రిజర్వు చేసుకోవాలి.
401 నుంచి 600
ఇక 401 నుంచి 600 వరకు ఐదు అంకెల నంబర్‌లో ఉన్న చివరి నంబర్లు ఉంటే.. అవి జనరల్ బోగీలు అన్నమాట. ఇందులో ఎలాంటి రిజర్వేషన్ ఉండదు. ఎవరైనా ఎక్కవచ్చు.
601 నుంచి 700
ఇక ఐదు అంకెల నంబర్‌లో చివరి మూడు నంబర్లు 601 నుంచి 700 వరకు ఉంటే ఆ బోగీలు చైర్ కార్ బోగీలు అన్నమాట. ఇందులో ఏసీ, నాన్ ఏసీ ఉంటాయి. కంఫర్ట్ చైర్లు ఉంటాయి. వీటని కూడా రిజర్వు చేసుకోవాలి.
701 నుంచి 800
బోగీపై ఉన్న ఐదు అంకెల నంబర్‌లో చివరన 701 నుంచి 800 వరకు ఉంటే అవి లగేజీ బోగీలు అన్నమాట. అందులో ప్రయాణికులు ఉండరు. కేవలం లగేజీ మాత్రమే తరలిస్తారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Have you noticed this on train bogies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com