Rohit Sharma: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి బిసిసిఐ ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని జట్ల ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే క్యాంపులలో చేరుతున్నారు. మైదానాలలో ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన ముంబై ఇండియన్స్ జట్టు కూడా క్యాంపు ఏర్పాటు చేసింది. ముఖ్యమైన ఆటగాళ్లు ఇప్పటికే శిబిరాలలో చేరిపోయారు. కసరత్తులు మొదలుపెట్టారు. కానీ కీలకమైన ఓ ఆటగాడు క్యాంపునకు గైర్హాజరయ్యాడు. దీంతో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ముంబై ఇండియన్స్ జట్టుకు గత సీజన్ వరకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు.. అంతేకాదు అతడి సారథ్యంలో ముంబై జట్టు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకుంది. అయితే ఈసారి అతడిని తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ గా ముంబై జట్టు యాజమాన్యం అవకాశం కల్పించింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోయి సాధారణ ఆటగాడిగా మిగిలాల్సి వచ్చింది. దీనిపై ఇప్పటికి జట్టులో చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఆకస్మాత్తుగా కెప్టెన్ ను ఎందుకు మార్చిందనేదానికి ముంబాయి ఇండియన్స్ జట్టు యాజమాన్యం వద్ద సమాధానం లేదు. ఇక ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో చివరిదైన ఐదో టెస్టు ధర్మశాల లో జరిగింది. ఆ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 103 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లో అతడు తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతూ ఫీల్డింగ్ లోకి రాలేదు. అతడి గైర్హాజరుతో జస్ ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించి 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆ విజయం అనంతరం ఐపీఎల్ లో ఆడేందుకు రోహిత్ సిద్ధమయ్యాడు. వాస్తవానికి ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించినప్పటికీ రోహిత్ ను పక్కనపెట్టి ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. దీనిపై రోహిత్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ జట్టులో చేరలేదు. ప్రస్తుతం అతడు తన కుటుంబంతో ఉన్నాడు. వెన్నునొప్పి ఇంకా తగ్గలేదని అతడి అంతరంగీకుల ద్వారా తెలుస్తోంది. అయితే అతడు ఎప్పుడు జట్టులో చేరుతాడనే దానిపై మొన్నటిదాకా ఒక క్లారిటీ రాలేదు. అతడు కూడా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే ముంబై వర్గాల సమాచారం ప్రకారం రోహిత్ సోమవారం ముంబై జట్టు శిక్షణ శిబిరంలో చేరతాడని తెలుస్తోంది. అయితే సోమవారం అతడు శిక్షణ శిబిరంలో కనిపించలేదు. పైగా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. శిక్షణ శిబిరంలో ఇంతవరకు రోహిత్ శర్మ చేరకపోవడం పట్ల పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రోహిత్ కు ఇంకా వెన్నునొప్పి తగ్గలేదని, అందువల్లే అతడు శిక్షణ శిబిరంలో చేరలేదని తెలుస్తోంది. ఒకవేళ నొప్పి తగ్గకుంటే అతడు ఐపిఎల్ ఆడేది అనుమానమేనని తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Hardik Pandya to Rohith Sharma :pic.twitter.com/y5IPf1BG7l https://t.co/oddC2dXXIw
— ️ (@rahull22_) March 17, 2024