Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ లో గొప్ప సుగుణాలు ఉన్నాయి. సమస్య మూలాలను శోధించి పట్టుకోవడం ఆయన నైజం. అవి చాలా సందర్భాల్లో ప్రస్పుటమయ్యాయి. సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయడం, వాటికి పరిష్కార మార్గం చూపడం ఒక వంతైతే..ఎందరో త్యాగాలను, మరికొందరి సాహసాలను వెలుగులోకి తెచ్చి సమాజానికి పరిచయం చేస్తుంటారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని తాను చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. తన మానస పుత్రికగా పేర్కొనే వలంటీరు వ్యవస్థ సేవలను గుర్తుచేస్తూ ఏటా వైసీపీ సర్కారు వందల కోట్ల రూపాయలతో సన్మానాలు చేసే జగన్ సర్కారు… తన ప్రభుత్వ వైఫల్యంతో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను మాత్రం పట్టించుకోలేదు. అటు ఆ ఘటనలో వందల మంది ప్రాణాలను కాపాడిన లష్కర్ రామయ్య సేవలు గుర్తించలేదు. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ మాత్రం లష్కర్ రామయ్య సేవలను గుర్తించి సన్మానించడమే కాదు. ఏకంగా రూ.2 లక్షలు అందించి తన ఉదారతను చాటుకున్నారు.

నాడు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుయిన సమయంలో లష్కర్ రామయ్య విధుల్లో ఉన్నారు. ముంపు ప్రమాదమున్న గ్రామాల ప్రజలకు అప్పటికప్పుడు ఫోన్ లో సమాచారమందించి అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు పరిస్థితిని చెప్పి.. రాత్రికి రాత్రి బాధిత గ్రామాలను ఖాళీ చేయించారు. దీంతో ఉన్నపలంగా పిల్లలు, పెద్దలు గ్రామాలను ఖాళీ చేసి సేఫ్ జోన్లోకి వెళ్లారు. ఫలితంగా ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. కానీ ఎక్కడ లష్కర్ రామయ్య పేరు వినిపించలేదు. అటు సాక్షి మీడియాలో సైతం రామయ్య సాహసానికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించే క్రమంలో జనసేన నేతలు లష్కర్ రామయ్య సేవలను గుర్తించారు. అధినేత పవన్ కు సమాచారమిచ్చారు. పవన్ గుర్తు పెట్టుకొని మరీ రామయ్యను జనసేన కేంద్ర కార్యాలయానికి రప్పించి సన్మానించారు. రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.
ఇప్పటం గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ అనే ఏడు పదుల వయసున్న వృద్ధురాలు పవన్ ను కలుసుకున్నారు. ఆమెను వేదిక మీదకు పిలిపించుకున్న పవన్ ముందుగా పాదాభివందనం చేశారు. ఆత్మీయంగా హత్తుకున్నారు. దీంతో వృద్దురాలు పులకించుకుపోయారు. భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటం ఇళ్ల ధ్వంసంచేసిన తరువాత బాధితులను పరామర్శించేందుకు పవన్ సిద్ధపడ్డారు.దీంతో మీడియా ఫోకస్ అంతా ఇప్పటం గ్రామంపైనే పడింది.

ఈ నేపథ్యంలో నాగేశ్వరమ్మను పలుకరించారు మీడియా ప్రతినిధులు. పవన్ రాకపై ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ గ్రామానికి వస్తుండడంపై మీకెలా ఉందని ప్రశ్నించారు.దీని నాగేశ్వరమ్మ మాట్లాడుతూ నా నాలుగో కుమారుడు ఇంటికి వస్తున్నట్టుందని బదులిచ్చారు. నాకు ముగ్గురు కుమారులు అని.. అందులో ఇద్దరు చనిపోయారని.. పవన్ తో నాకిప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారని బదులిచ్చారు. ఈ విషయం మీడియాలో రావడాన్ని పవన్ చూశారు. ఆదివారం ఇప్పటం గ్రామస్థులను కలుసుకున్న నేపథ్యంలో నాగేశ్వరమ్మను కూడాతీసుకు రావాలని సూచించారు. మీరే కదమ్మ నన్ను మీకుమారుడని చెప్పిందని పలకరిస్తూ పాదాలను తాకారు. అయితే ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా బావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ ఔన్నత్యానికి హ్యాట్సాప్ చెప్పారు. లష్కర్ రామయ్య,ఇటు నాగేశ్వరమ్మ విషయంలో పవన్ వ్యవహరించినతీరు సభికులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యింది.