Hari Hara Veera Mallu: యూత్ , మాస్ మరియు ఫామిలీ ఎంటర్టైన్మెంట్స్ సినిమాలే తీస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్, మొట్టమొదటిసారి ఇప్పటి వరకు తానూ ముట్టుకొని జానర్ అయిన పీరియాడిక్ జనార్ లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాపై అభిమానుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఇప్పటి వరకు విడుదలైన రెండు గ్లిమ్స్ వీడియోస్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..పవన్ కళ్యాణ్ లుక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని డిసెంబర్ 31 వ తారీఖున విడుదల చేద్దాం అనుకున్నారు.

కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి సంబంధించిన వర్క్ పూర్తి కాకపోవడం తో వాయిదా వేశారు..ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్స్ లో విరామం లేకుండా సాగుంతోంది..సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి రోజుకి ఒక వార్త సోషల్ మీడియా లో లీక్ అవుతూ అభిమానులను ఉర్రూతలు ఊగించేలా చేస్తున్నాయి..ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే..ఈ సినిమాలో ఆయన వజ్రాల దొంగ గా నటిస్తున్నాడు..సినిమా కథ మొత్తం కోహినూర్ డైమండ్ ని దంగతనం చేసే నేపథ్యం లో కొనసాగుతుంది..మొఘల్ సామ్రాజ్యం లో ఉన్న ఆ కోహినూర్ డైమండ్ ని వీరమల్లు ఎలా దొంగిలించగలిగాడు అనేది చాలా అద్భుతంగా తెరకెక్కించాడట డైరెక్టర్ క్రిష్.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసే పోరాట సన్నివేశాలు అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయట..అయితే ఈ సినిమాలో కోహినూర్ వజ్రం నిజంగా ఉన్న ఫీల్ రప్పించడం కోసం..నిర్మాత AM రత్నం 30 లక్షలు ఖర్చుపెట్టి కోహినూర్ డైమండ్ ని పోలి ఉండే నిజమైన వజ్రాన్ని తెప్పించాడట..ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఖర్చు కి ఏమాత్రం కూడా వెనకాడకుండా ఈ సినిమాకోసం AM రత్నం పెడుతున్న ఖర్చు చూస్తుంటే ఆయనకీ ఈ సినిమా పట్ల ఎంత నమ్మకం మరియు ఇష్టం ఉందొ అర్థం అవుతుంది.