
Harbhan Singh And Suresh Raina: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు..’ పాటకు ఓరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడంతో మరోమారు ఆ పాట విశ్వవ్యాప్తంగా అందరినీ షేక్ చేస్తోంది. ఊరమాస్ పాటకు.. అందరూ నాటు స్టెప్పులు వేస్తున్నారు. తెలుగు సినీ ప్రియులు, డ్యాన్సర్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరూ వయోబేధంతో సబంధం లేకుండా నాటు నృత్యాలతో అకట్టుకుంటున్నారు. ఇక వీఐపీలు అయితే నాటు.. నాటు పాటకు స్టెప్స్ వేసి ఆ వీడియోను సమాజాకి మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
గతంలో అనేక మంది..
నాటు.. నాటు పాటకు సినిమా విడుదలైన సమయంలోనే చాలా మంది నృత్యాలు చేశారు. ముఖ్యమంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఊర మాసు స్టెప్పులు వేశారు. తర్వాత అనేక మంది డ్యాన్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇటీవల ఆస్కార్ వేదికపై కూడా చాలా మంది నాటు.. నాటు పాటకు స్టెప్పులు వేశారు.

తాజాగా రైనా, బజ్జీ..
తాజాగా నాటు.. నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. దీంతో మరోమారు విశ్వవ్యాప్తంగా ఈ పాట మార్మోగుతోంది. అదే సమయంలో క్రికెటర్లు,వీఐపీలు, నాయకులు, యూత్ స్టెప్పులతో అలరిస్తున్నారు. తాజాగా రిటైర్డ్ క్రికెటర్లు సురేశ్ రైనా, స్పిన్నర్ హర్బజన్‌సింగ్ కూడా ఈ పాటకు ఊరమాసు స్టెప్పులేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A classic @ImRaina shot! 🔥@IndMaharajasLLC #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #IMvsWG pic.twitter.com/FtdhpF5B4U
— Legends League Cricket (@llct20) March 15, 2023