
Divi Vadthya: సినిమాల్లో హీరోయిన్ గా రెండు సినిమాల్లో నటించి,ఆ తర్వాత సక్సెస్ రాకపొయ్యేసరికి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా ఫేమస్ అయ్యి ఆ తర్వాత ఏకంగా బిగ్ బాస్ వంటి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పాల్గొన నటి దివి.బిగ్ బాస్ హౌస్ ద్వారా ఈమె కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఈమెకి సినిమాల్లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
గత ఏడాది ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.ఆ పాత్రకి మంచి పేరు వచ్చింది కూడా.ఇప్పుడు కూడా ఈమె పలువురి స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తుంది కానీ, సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.ఎలాగో అవకాశాలు బాగానే వస్తున్నాయి కాబట్టి కెరీర్ ని మలుపు తిప్పే పాత్రలు కూడా త్వరలోనే వస్తాయని ఊహించొచ్చు.

ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే దివి రీసెంట్ గా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూ లో ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీ లో కొత్తేమి కాదు, ఎప్పటి నుండో ఉన్నదే..కొంతమంది కెరీర్ కోసం అంగీకరించి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇష్టం లేక సినీ కెరీర్ ని వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.ఎవరి ఇష్టం వారిది, అవకాశాల కోసం కమిట్మెంట్ ఇవ్వడం లో కూడా నాకైతే ఎలాంటి తప్పు కనిపించడం లేదు’ అంటూ దివి ఈ సందర్భంగా మాట్లాడింది.ఆమె మాట్లాడిన మాటలపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.