
Pawan Kalyan craze : ఆకలిదప్పులకు లెక్కచేయలేదు. సమయం మించిపోతుందని అసంతృప్తి చెందలేదు. అధినేత రాక ఆలస్యమైందని ఆగ్రహించలేదు. ఉదయం నుంచి అదే ఓపిక, అదే సహనం. మొన్నటి జనసేన ఆవిర్భావ సభలో జన సైనికుల నిగ్రహానికి సెల్యూట్ చేయాల్సిందే. అభినందనలు తెలపాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని అభిమానాన్ని పవన్ సొంతం చేసుకున్నారు. అది ఆవిర్భావ సభలో ప్రస్పుటంగా కనిపించింది. రాజకీయ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేలా పవన్ పై పెల్లుబికిన అభిమానం చూసి వారు ఫిదా అయిపోయారు. ఈయన్నా మనం ఇన్నాళ్లు తక్కువ చేసి మాట్లాడమని పశ్చాత్తాపం పడేలా ఆవిర్భావ సభ చరిత్ర సృష్టించింది.
ఇప్పటివరకూ వ్యక్తిని ఆరాధించి ఉంటాం. భక్తి భావంతో కొలిచి ఉంటాం. కానీ పవన్ అనే వ్యక్తిని గుండెల్లో పెట్టుకొని కొలిచే లక్షలాది మందిని పదో ఆవిర్భావ సభలో చూశాం, అందులో సినీ, రాజకీయ అభిమానులు ఉన్నారు. అయితే ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం ఈ అభిమాన గణంలో చేరిపోవడం ఆశ్చర్యకితులను చేస్తోంది. మధ్యాహ్నం 12.30లకు విజయవాడలోని నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరిన పవన్ …ఆటోనగర్, తాడిగడప జంక్షన్ , పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్ ,పామర్రు – గుడివాడ సెంటర్ (బైపాస్), గూడూరు సెంటర్ మీదుగా మచిలీపట్నం సాయంత్రం ఐదు గంటలకు చేరుకోవాలన్నది షెడ్యూల్. కానీ దారిపొడవునా మంగళహారతులు, స్వాగతాలతో సంబ్రమాశ్చర్యాలకు గురిచేశారు. తమ అభిమానాన్ని చాటుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడలో బయలుదేరిన పవన్.. మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి చేరుకోవడానికి రాత్రి 10 గంటలైంది.

అయితే పవన్ కళ్యాణ్ తో సరిసమానంగా మరొకరు గౌరవం అందుకున్నారు. అదే వారాహి వాహనం. దారి పొడవునా పవన్ ను చూడాలనుకునేవారు వారాహి వాహనాన్ని కనులారా చూసి ఆనందపడ్డారు. గత కొద్ది నెలలుగా వారాహి వాహనం విషయంలో వైసీపీ సర్కారు చేసిన అతి అంతా ఇంతా కాదు. దీంతో ఆ వాహనంపై అంచనాలు పెరిగిపోయాయి. పదో ఆవిర్భావ సభకు వారాహి వాహనంపై పవన్ రానున్నారని తెలియడంతో ప్రజలు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ వాహనం ప్రత్యేక ఏమిటబ్బా? అంటూ ఆరాతీయడం మొదలుపెట్టారు. పవన్ ను చూసి ఆనందించిన లక్షలాది కళ్లు.. వారాహి వాహనం చూసి మురిసిపొయాయి. యుద్ధ రధంగా అభివర్ణిస్తున్నారు. పెనుములూరులో అయితే మాజీ ఎమ్మెల్య బోడె ప్రసాద్ తన సెల్ ఫోన్ తో పవన్, వారాహి వాహనంతో పాటు జనసంద్రం ఫొటోలను బంధించారు. తన ఇంటిపై నుంచి ఫొటోలు తీయడం మీడియా కంట పడింది. అది మరింత వైరల్ గా మారాయి.
పవన్ విజయవాడ నుంచి మచిలీపట్నం రావడానికి దాదాపు ఆరు గంటలు పట్టింది. సరిగ్గా రాత్రి 9.30 గంటలకు ఆయన సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అప్పటివరకూ ఇతర నాయకుల ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగాయి. దాదాపు అరపూట ఆలస్యమైనా జన సైనికులు విసుగు చెందలేదు. పది గంటలకు ప్రసంగం ప్రారంభించిన పవన్ దాదాపు గంటన్నర పాటు కొనసాగించారు. అర్ధరాత్రి సమీపించినా జన సైనికుల్లో మాత్రం ఆ బడలిక కనిపించలేదు. ఇతర పార్టీల సభలు, సమావేశాలు చూస్తున్నాం. అధినేత ప్రసంగం ప్రారంభమయ్యేలోగా గేటు దాటి వెళ్లిపోతుండడం గమనిస్తున్నాం. కానీ జనసేన పదో ఆవిర్భావ సభలో మాత్రం జన సైనికులు నిగ్రహం పాటించారు. వారికి సెల్యూట్ చేయాల్సిందే.