Harassment On TV Anchor: ఈమధ్య కాలం లో ఆడపిల్లలపై మగవాళ్ల అకృత్యాలు ఏ స్థాయికి చేరుకున్నాయి రోజు మనం టీవీలలో న్యూస్ పేపర్స్ లో చూస్తూనే ఉన్నాము..సామాన్య ఆడపిల్లల మీద మాత్రమే కాదు..సినీ సెలెబ్రెటీలకు కూడా కొంతమంది మృగాళ్ల నుండి రక్షణ లభించడం లేదు..ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ వంటివి జరగడం..వాటిపై కొంతమంది హీరోయిన్స్ మాట్లాడడం వంటివి మనం చూస్తూనే ఉన్నాము..రీసెంట్ గా ఒక ప్రముఖ టీవీ యాంకర్ పై ఒక మృగాడు అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నం చేసాడు.

ఇక అసలు విషయానికి వస్తే మధురానగర్ లో ఒక హాస్టల్ లో ప్రముఖ టీవీ యాంకర్ (వయస్సు 27 ఏళ్ళు) నివాసం ఉంటుంది..ఆమె కళాశాలలో చదివే రోజుల నుండి తన సహా విద్యార్థి సాగర్ (వయస్సు 30 ఏళ్ళు) తనని ప్రేమించమని రోజు వేధించేవాడు..ఆమె ఒప్పుకోకపోవడం తో కనీసం స్నేహితులు లాగ అయినా ఉండమని బ్రతిమిలాడాడు..అతని మాటలను నమ్మి అతనితో స్నేహం చేసింది ఆమె..అదే ఆమె జీవితం లో చేసిన పెద్ద పొరపాటు.
ఒకరోజు ఎవ్వరు లేని ప్రాంతానికి ఆమెని తీసుకేల్లో అత్యాచార ప్రయత్నం చేసాడు..అతి కష్టం మీద ఆ మృగాడిని తప్పించుకొని ఆరోజు భయపడింది..ఇక ఆరోజు నుండి అతగాడు ఆమెని వేధిస్తూ ‘నా కోరిక తీర్చు..లేదంటే నీ నగ్న చిత్రాలను మార్ఫింగ్ చేసి యూట్యూబ్ లో , ఫేస్ బుక్ లో పెట్టి నీ పరువు మొత్తం తీసేస్తాను’ అంటూ బెదిరించాడు.

అతని వల్ల ఆమె చాలా మానసిక క్షోభ కి గురైంది..ఇక చేసేదేమి లేక బాధితురాలు SR నగర్ పోలీస్ స్టేషన్ లో ఆ మృగాడి పై ఫిర్యాదు చేసింది..పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..త్వరలోనే విచారణ పూర్తి చేసి అతనిని అరెస్టు చేస్తామంటూ పోలీసులు చెప్పుకొచ్చారు..మరి ఆ అమ్మాయికి న్యాయం ఎంత తొందరగా జరుగుతుందో చూడాలి.