Gujarat Old Man: ఎంతటి సరసుడవో తెలిసెరా అన్నారో సినీకవి. వృద్ధాప్యం శరీరానికే కాని మనసుకు కాదని అతడు నిరూపించాడు. 89 ఏళ్ల వయసులో శృంగారం కోసం తహతహలాడుతున్నాడు. భార్య అరోగ్యంగా లేకపోయినా తన కోరిక తీర్చాని వేధిస్తున్నాడు. దీంతో ఆమె అభయం ను ఆశ్రయించింది. తన భర్త నుంచి కాపాడాలని వేడుకుంది. వృద్ధుడి విషయం తెలుసుకున్న సిబ్బంది నిర్ఘాంత పోయారు. ఈ వయసులో కూడా అతడు సెక్స్ కోసం తపించిపోవడం గమనార్హం. యవ్వనంలో ఉన్న జంటలే సెక్స్ ను ఆస్వాదించలేకపోతున్నా అతడు మాత్రం తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు భార్యను నిత్యం వేధిస్తున్నాడు. భర్త పెట్టే బాధలను తప్పించుకోవడానికి ఆమె 181 అభయం హెల్ప్ లైన్ ను ఆశ్రయించడం సంచలనం కలిగించింది. ఆమె హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గుజరాత్ లోని వడోదరకు చెందిన ఓ 89 ఏళ్ల వృద్ధుడు తన భార్య(87)ను నిత్యం కామవాంఛ తీర్చాలని వేధిస్తున్నాడు. తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె నిరాకరిస్తోంది. అయినా అతడిలో మార్పు లేదు. ఒకటే గొడవ చేస్తుండటంతో వేగలేపోయింది. తాను స్వంతంగా నడవలేకపోతున్నా కూడా అర్థం చేసుకోని అతడు లైంగిక కోరికను తీవ్రంగా వ్యక్తం చేస్తున్నాడు. దీంతో ఆమె తట్టుకోలేకపోతోంది. తన ఆరోగ్యం బాగయ్యే వరకైనా ఆగాలని కోరినా వినడం లేదు. తన కోరిక తీర్చాల్సిందేనని పట్టుబడుతున్నాడు.
ఇంత లేటు వయసులో కూడా అతడిలో లైంగిక ఉద్దీపణలు ఈ స్థాయిలో ఉండటంతో ఏం చేయాలో కూడా భార్యకు అర్థం కాలేదు. తన అనారోగ్యాన్ని సైతం లెక్కచేయడం లేదు. తన కోరికకే ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. దీనిపై సదరు సంస్థ సిబ్బంది కూడా వారికి ఓ పరిష్కార మార్గం చూపారు. శృంగార వాంఛ పక్కదారి పట్టేందుకు ప్రతి రోజు యోగా చేయాలని సూచించారు. పార్కులు, పబ్లిక్ స్థలాలు, చారిత్రక ప్రదేశాలు దర్శించి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు.

రోజు ధ్యానం చేస్తే కూడా ఫలితం ఉంటుంది. అంతేకాని అతడు ఏ పని చేయకుండా ఉండటంతో లైంగిక వాంఛ పెరుగుతోందని గుర్తించారు. దీంతో వారు సూచించిన మేరకు అతడు తన వాంఛలను తగ్గించుకునే నిమిత్తం ఈ పనులు చేసి భార్యను వేధించకుండా చూడాలని సూచిస్తున్నారు. ఇంత వయసులో భార్యను ఇబ్బందులకు గురి చేస్తూ తన కోరిక తీర్చాలని వెంట పడటంతో అందరు అవాక్కయ్యారు. ఈ వయసులో అతడి చేష్టలను అందరు చీదరిస్తున్నారు. భార్య పరిస్థితిని అర్థం చేసుకోకుండా వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.