Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి ఇష్టపడి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. పైగా, ఇది మల్టీస్టారర్. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ వాల్తేరు వీరయ్య సినిమాలో ఇప్పటికే హీరో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా, ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?, విక్టరీ వెంకటేష్ ఓ గెస్ట్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో వెంకటేష్ సరదాగా 2 నిమిషాల పాటు కనిపిస్తారని, చిరు – వెంకీ – రవితేజ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో ఓ కామెడీ సీక్వెన్స్ లో ఫుల్ గా నవ్విస్తారని.. ఈ ఫన్ తోనే సినిమా ఎండ్ అవుతుందని తెలుస్తోంది.

ఏది ఏమైనా తెలుగు తెర పై కొన్ని కలయికలు చూడడానికే కాదు, వినడానికి కూడా చాలా బాగుంటాయి. చిరు – వెంకీ – రవితేజ కలయిక కూడా అదిరిపోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కలయిక గురించే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా విషయంలో మెగాస్టార్ బాగా ఇన్ వాల్వ్ అవుతున్నారు. బెస్ట్ అవుట్ ఫుట్ కోసం చిరు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.
పైగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఎలాగూ రవితేజ పాత్ర కూడా చాలా బలమైనది. ఇప్పుడు వీరితో పాటు వెంకటేష్ కూడా చేరబోతున్నాడు. అందుకే, ఈ సినిమా పై బయ్యర్లు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో రవితేజ, చిరంజీవిలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందట. అన్నట్టు ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ కూడా ఉంది. మరో సీనియర్ హీరోయిన్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ?, కళ్లతోనే మాయ చేసిన అలనాటి హీరోయిన్ ఆమె. అందం, అభినయం కలబోసిన ఆ హీరోయినే.. శోభన. ఒకప్పుడు హీరోయిన్ గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ క్రేజ్ ఉన్న ‘శోభన’.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే, మెగాస్టార్ కోసం ఈ సినిమాలో ఆమె నటిస్తుండటం విశేషం.